సోనూసూద్‌ కూడా తప్పుకున్నాడు…!

Sonu Sood Also Withdraw From Manikarnika Movie

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మణికర్ణిక’. ఈ చిత్రంకు టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథను అందించిన విషయం తెల్సిందే. తెలుగు దర్శకుడు క్రిష్‌ ఆ చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. కాని హీరోయిన్‌తో విభేదాల కారణంగా ఆ చిత్రం నుండి క్రిష్‌ బయటకు వచ్చేశాడు. గత కొన్ని రోజులుగా ఈ విషయమై మీడియాలో వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తలు పుకార్లే అని మణికర్ణిక చిత్రీకరణ పూర్తి అవ్వడంతోనే ఆ చిత్రంకు సంబంధించిన పనుల్లో క్రిష్‌ కలుగజేసుకోవడం లేదు అంటూ అంతా అనుకున్నారు. కాని తాజాగా ‘మణికర్ణిక’ చిత్రీకరణ పూర్తి కాలేదు అని, కంగనా రనౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతుందని తేలిపోయింది.

manikarnika

‘మణికర్ణిక’ చిత్రం నుండి దర్శకుడు తప్పుకున్న వార్తలు మరిచిపోయామో లేద అప్పుడే ఈ చిత్రం నుండి నటుడు సోనూసూద్‌ తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు. ఇతర చిత్రాలు కమిట్‌ అయ్యి ఉన్న కారణంగా డేట్లు క్ల్యాష్‌ అవుతున్నాయని, దాంతో మణికర్ణిక చిత్రం నుండి తప్పుకుంటున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. కాని కంగనా మాత్రం సోనూసూద్‌కు హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రంలో నటించడం ఇష్టం లేక, హీరోయిన్‌ దర్శకత్వంలో నటించడం ఇష్టం లేకపోవడం వల్లే తప్పుకున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మొత్తానికి మణికర్ణిక చిత్రం వరుసగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో 25వ తారీకున ఈ చిత్రంను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీ స్టూడియో వారు ఈ చిత్రంను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

soonu-sood