మణిరత్నం మూవీని వదిలేసిన విజయ్‌ దేవరకొండ…!

Tollywood New Star Vijay Devarakonda

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎవరి నోట విన్నా కూడా విజయ్‌ దేవరకొండ మాట వినిపిస్తుంది. ‘అర్జున్‌ రెడ్డి’ మరియు ‘గీత గోవిందం’ చిత్రాలతో విజయ్‌ దేవరకొండ ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయ్యాడు. ఈయన చేస్తున్న ప్రతి ఒక్క సినిమాపై సినీ వర్గాల వారితో పాటు ప్రేక్షకుల దృష్టి కేంద్రీకృతం అయ్యి ఉంది. అందుకే ఈయన కమిట్‌ అవుతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గీత గోవిందం చిత్రం విడుదలకు ముందు తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించే అవకాశం దక్కింది. అర్జున్‌ రెడ్డి చిత్రంతో తెలుగులో మంచి క్రేజ్‌ను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ తమిళంలో అతి తక్కువ పారితోషికంకు నటించేందుకు నో చెప్పాడు.
vijay
మణిరత్నం అతి తక్కువ పారితోషికం ఆఫర్‌ చేయడంతో పాటు, నలుగురు హీరోల్లో ఒక్కడిగా నటించడం ఇష్టం లేదని కథ కూడా వినకుండానే విజయ్‌ దేవరకొండ నో చెప్పినట్లుగా తెలుస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘చెక్క చివంత వానమ్‌’ చిత్రంను తెలుగులో ‘నవాబ్‌’గా డబ్‌ చేయడం జరుగుతుంది. తెలుగులో ఈ చిత్రం భారీ విజయాన్ని దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ ఉంటే ఇంకా స్థాయి పెరిగేదని, విజయ్‌ మంచి అవకాశంను వదులుకోవడంతో పాటు, మణిరత్నం కూడా ఈ చిత్రంలో విజయ్‌ను అడిగినంత పారితోషికం ఇచ్చి పెట్టి ఉంటే బాగుండేది అని ఇప్పుడు అనుకుంటున్నాడు. ఇటీవలే టీజర్‌వచ్చిన ‘నవాబ్‌’ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

vijay-movies