అనుమానం లేదు.. ఎన్టీఆర్‌ రావడం ఖాయం…!

NTR Aravindha Sametha Movie Release On Dasara

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇటీవల ఎన్టీఆర్‌ తండ్రి హరికృష్ణ మృతి చెందడంతో మూడు రోజు షూటింగ్‌కు విరామం ఇచ్చారు. షూటింగ్‌ ఇప్పట్లో మళ్లీ మొదలు కాదని అంతా భావిస్తున్న సమయంలో మూడు రోజుల్లోనే ఎన్టీఆర్‌ తిరిగి షూటింగ్‌కు రావడంతో అంతా కూడా షాక్‌ అవుతున్నారు. చిత్రంను ముందుగా అనుకున్న తేదీకి విడుదల చేయాలి అంటే ఖచ్చితంగా ఈ 15 రోజులు ఏకధాటిగా చిత్రీకరణ చేయాల్సి ఉంది. కాస్త అటు ఇటు అయినా కూడా చిత్రం విడుదల అవ్వడం కష్టం.

aravindha-sammetha

ఇప్పటికే చాలా ఆలస్యం అయిన ఎన్టీఆర్‌ ఒకవేళ తన చిత్రాన్ని దసరాకు తీసుకు రాకపోతే త్రివిక్రమ్‌పై విరుచుకు పడతారు. అందుకే ఈ చిత్రంను దసరాకు విడుదల చేసేందుకు ఎన్టీఆర్‌ పుట్టెడు బాధను దిగమింగుకుని మరీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు, ప్రస్తుతం ఎన్టీఆర్‌తో పాటు ముఖ్య తారాగణంతో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుతున్నాడు. విదేశాల్లో షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసిన త్రివిక్రమ్‌ ఇంతకు ముందే టైం లేదని క్యాన్సిల్‌ చేశాడు. ఇప్పుడు చిత్రీకరణ ఏమాత్రం ఆలస్యం చేయకుండా హడావుడిగా చిత్రీకరణ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఒక వైపు చిత్రీకరణ చేస్తూనే మరో వైపు చిత్రంకు సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించే పనిలో త్రివిక్రమ్‌ ఉన్నాడు.

aravindha-sametha-m-ovies