క్వీన్ కి వరుస ఎదురుదెబ్బలు

క్వీన్ కి వరుస ఎదురుదెబ్బలు

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే వ్యవసాయ చట్టాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తుమకూరు కోర్టు ఆదేశాల మేరకు క్యతాసంద్ర పోలీస్ స్టేషన్‌లో కంగనాపై ఎఫ్‌ఐఆర్ దాఖలవ్వగా ఇటీవల బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశంతో ముంబై పోలీసులు కంగనాపై దేశ ద్రోహం కేసు కింద మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్విటర్‌ ద్వారా స్పందించిన కంగనా వ్యంగ్యంగా కామెంట్‌ చేశారు. ‘నవరాత్రి వేళ ఎవరు ఉపవాసం ఉన్నారు? ఈ రోజు వేడుకల నుంచి ఫోటోలు ఇవి. ఇక నాపై మరొక కేసు నమోదైంది. మహారాష్ట్రలోని పప్పు సేన నాపై మక్కువతో ఎక్కువై పోయిందనిపిస్తుంది, నన్ను మిస్ అవ్వద్దు.. త్వరలోనే అక్కడకు వస్తాను’. అంటూ ట్వీట్‌ చేశారు. చదవండి: ‘ఇరా డిప్రెషన్‌కు ఆమె తల్లిదండ్రులే కారణం’

ఈ ట్వీట్‌ తరువాత తాజాగా కంగనా రనౌత్‌కు ఒడిశాకు చెందిన న్యాయవాది నుంచి అత్యాచారం బెదిరింపు వచ్చింది. ప్రస్తుతం తన స్వస్థలమైన మనాలిలో ఉన్న కంగనా ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. అయితే తన ఖాతా హ్యాక్ చేశారని సదరు న్యాయవాది అనంతరం ఓ పోస్ట్ చేశాడు. ‘ఈ రోజు నా ఫేస్‌బుక్ హ్యాక్ అయింది. అందులో నుంచి అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్టు చేశారు. స్త్రీలను, సమాజాన్ని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు నావి కాదు. వీటిని చూసి నేను కూడా చాలా షాక్ అయ్యాను. వీటి వల్ల ఎ వరి మనోభావాలు అయిన దెబ్బతింటే నన్ను కక్షమించండి. అని కోరారు. అనంతరం తన ఫేస్‌బుక్ ఖాతాను తొలగించారు.