షాకింగ్ లుక్‌లో కంగ‌నా ర‌నౌత్

kangana ranaut shocking look

బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ఒకవైపు సినిమాలు మ‌రోవైపు కాంట్ర‌వ‌ర్సీస్‌తో ఎప్పుడు వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంటుంది. ఆ మ‌ధ్య మ‌ణిక‌ర్ణిక అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన కంగ‌నా ప్ర‌స్తుతం తెలుగు డైరెక్టర్ ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెర‌కెక్కిన “జడ్జిమెంటల్ హై క్యా”లో న‌టించింది. ఇందులో రాజ్ కుమార్ రావ్ హీరోగా న‌టించారు. ఇక అశ్విన్ అయ్యర్ తివారి దర్శకత్వంలో “పంగా” అనే క్రీడా ప్రధాన చిత్రంలో నటించనుంది కంగనా. వీటితో పాటు కంగ‌నా .. ర‌జ‌నీష్ రాజి ఘాయ్ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ చిత్రం చేస్తుంది. ధాక‌డ్ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతుంది. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో కంగ‌నా.. మంట‌ల మ‌ధ్య నిలుచొని రెండు గ‌న్స్ ప‌ట్టుకొని ఉంది. ఈ లుక్‌ని చూస్తుంటే 2001లో ఏంజెలినా జోలి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన‌ టాంబ్ రైడ‌ర్ గుర్తుకొస్తుంది . ఇందులో ఏంజెలినా కూడా మార‌ణాయుధాల‌తో షాకింగ్ లుక్‌లో క‌నిపిస్తుంది. ధాక‌డ్ చిత్రాన్ని సోహైల్ మాక్లాయ్ నిర్మిస్తుండగా,వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుందట. వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో లో షూటింగ్ మొదలుకానుంది సమాచారం. ఈ సినిమా త‌న కెరీర్‌లో బెంచ్ మార్క్‌గా నిలుస్తుంద‌ని కంగ‌నా భావిస్తుంది.