పేరు మారిపోయింది.. వివాదం నిజమేనా…?

Kangana Ranaut Takes Over As The Director Of Manikarnika

ప్రముఖ దర్శకుడు క్రిష్‌ బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో ‘మణికర్ణిక’ అనే చిత్రంను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం పూర్తి అవ్వకుండానే బాలకృష్ణతో ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని క్రిష్‌ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్‌ కంగనా రనౌత్‌కు మరియు క్రిష్‌లకు మద్య వివాదం నెలకొంది అటూ టాక్‌ వినిపించింది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్‌ సభ్యులు స్పందిస్తూ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అసలు మా మద్య విభేదాలే లేవు అంటూ కంగనా ఇటీవలే సోషల్‌ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్‌ చిత్రంను పూర్తి చేయాల్సి ఉంది కనుక క్రిష్‌ ఎక్కువగా ఆ చిత్రంకు వర్క్‌ చేస్తున్నాడు అని, త్వరలోనే మళ్లీ మణికర్ణిక వర్క్‌ను మొదలు పెడతాడు అంటూ కూడా కంగనా చెప్పుకొచ్చింది.

manikarnika

ఈ సమయంలోనే ‘మణికర్ణిక’ క్లాప్‌ బోర్డ్‌ సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఆ బోర్డుపై దర్శకుడి పేరు కంగనా రనౌత్‌ అంటూ రాసి ఉంది. దాంతో మణికర్ణిక నుండి క్రిష్‌ తప్పుకున్నట్లుగా అధికారికంగా వెళ్లడి అయ్యింది. ఆ చిత్రాన్ని స్వయంగా కంగనా తెరకెక్కిస్తున్నట్లుగా తెలిపోయింది. కంగనా ఇస్తున్న సలహాలు సూచనలతో విసుగెత్తిన క్రిష్‌ ఆ ప్రాజెక్ట్‌ నుండి బయటకు వచ్చి ఉంటాడు అంటూ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. క్రిష్‌ ఒక విభిన్నమైన దర్శకుడు. ఆయన తాను అనుకున్నట్లుగా చేయనిస్తేనే సినిమాను చేస్తాడు. లేదంటే తనకు సంబంధం లేదు అంటూ తప్పుకుంటాడు. ఈ చిత్రం విషయంలో కూడా అదే జరిగింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మణికర్ణిక చిత్రం టైటిల్స్‌లో దర్శకుడి పేరు స్థానంలో ఎవరి పేరును వేస్తారో చూడాలి.

manikarnika-ran-outh