అజిత్ దర్శకుడితో బన్నీ

allu arjun movie with director siva

అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య’ చిత్రం తర్వాత చేయబోతున్న చిత్రంపై ఇంకా క్లారిటీ రాలేదు. నా పేరు సూర్య చిత్రం సక్సెస్‌ అయితే వెంటనే విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో బన్నీ మూవీ మొదలు అయ్యేది. కాని ఆ చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో ప్రయోగాల జోలికి వెళ్లవద్దని బన్నీ భావిస్తున్నట్లుగా మెగా వర్గాల వారు అంటున్నారు. నిన్న మొన్నటి వరకు తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో బన్నీ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తెలుగు మరియు తమిళంలో ద్విభాష చిత్రంగా అల్లు అర్జున్‌తో సినిమాను చేసేందుకు తమిళ నిర్మాత జ్ఞానవేల్‌రాజా ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది. తమిళ మీడియాలో కూడా జ్ఞానవేల్‌ రాజా ప్రముఖ దర్శకుడు లింగు స్వామితో తెలుగు హీరోను పెట్టి సినిమాను నిర్మించబోతున్నట్లుగా కథనాలు రాయడం జరిగింది.

allu-arjun

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జ్ఞానవేల్‌ రాజా నిర్మాణంలో తెరకెక్కబోతున్న చిత్రంకు దర్శకుడు లింగు స్వామి కాదని, ఈ చిత్రం కోసం శివను దర్శకుడిగా ఆయన ఎంపిక చేసినట్లుగా టాక్‌ వినిపిస్తుంది. అజిత్‌తో సూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన శివ ప్రస్తుతం ‘విశ్వాసం’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. త్వరలోనే ఆ చిత్రం విడుదల కాబోతుంది. ఆ చిత్రం తర్వాత బన్నీతో ద్విభాష చిత్రాన్ని ఆయన చేస్తాడు అంటూ తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఒక మంచి సబ్జెక్ట్‌ను ఇప్పటికే బన్నీకి వినిపించడం జరిగిందని, మెగా ఫ్యామిలీకి ఆ సబ్జెక్ట్‌ బాగా నచ్చడంతో కాస్త ఆలస్యం అయినా కూడా శివ దర్శకత్వంలోనే బన్నీ చిత్రాన్ని చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బన్నీ సినిమా ప్రారంభం ఈ ఏడాదిలో లేనట్లే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఆలస్యం అయినా బన్నీ మంచి చిత్రంతో రావాలని మెగా ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

allu-arjun