దేవదాస్ ఫస్ట్ సాంగ్ : వారు వీరు

devdas first single

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్స్ నాని, నాగ్ నటిస్తున్న దేవదాస్ ఒకటి. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అక్కినేని అభిమానులలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. చాన్నాళ్ళ తర్వాత వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని సరసన రష్మిక మందన, నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో దేవ్ అనే పాత్రలో డాన్ గా నాగార్జున, దాస్ అనే పాత్రలో డాక్టర్ గా నాని కనిపించనున్నారు.

devdas-movie

 

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. మూవీ రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో చిత్ర యూనిట్ ప్రొమోషన్ లు మొదలు పెట్టింది. ఇటీవ‌ల స్మాల్ పెగ్ అంటూ టీజ‌ర్ విడుద‌ల చేసి అభిమానుల‌లో సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఇక ఈరోజు సాయంత్రం ఆరుగంట‌ల‌కి చిత్రానికి సంబంధించి తొలి సాంగ్ వీడియో విడుద‌ల చేశారు…సాంగ్ మీరూ చూస్తూ వినేయ్యండి మరి