రామ్‌ సినిమాకు రీ షూట్…!

Ram's Hello Guru Prema Kosame Release On Dasara

2017లో భారీ విజయాలను దక్కించుకునా నిర్మాత దిల్‌రాజు ఈ సంవత్సరం కాస్త డల్‌ అయ్యాడు. దిల్‌రాజు ‘లవర్‌’ చిత్రంతో 2018ని ఆరంభించాడు. రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన ‘లవర్‌’ చిత్రంను నమ్మకంతో సమర్పించాడు. ఆ చిత్రంపై దిల్‌రాజు పెట్టుకున్న నమ్మకం వమ్ము అయ్యింది. ఆ తర్వాత దిల్‌రాజు ఎంతో నమ్మి నిర్మించిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెళ్లి గురించి అద్బుతంగా చిత్రంలో చూపించినట్లుగా దిల్‌రాజు పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. సినిమాపై ఆయన చాలా ఆశలు పెట్టుకోవడంతో పాటు, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు పెంచాడు. నితిన్‌, రాశిఖన్నా నంటించిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం భారీ నష్టాలను దిల్‌ రాజుకు మిగిల్చింది.

ram-haloguru-premakosame

ఇక ఈ సంవత్సరం దిల్‌రాజు నుండి రాబోతున్న చివరి చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. రామ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రంకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. ఏమాత్రం ఛాన్స్‌ తీసుకోకుండా దిల్‌రాజు సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో ఇన్వాల్వ్‌ అయ్యి అన్ని తానై చూసుకుంటున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అయిన కొన్ని సీన్స్‌ను పరిశీలించిన దిల్‌రాజు వాటి విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేసి, రీ షూట్‌కు ఆదేశించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎడిటింగ్‌తో పాటు అన్ని విధాలుగా దిల్‌రాజు అదనపు శ్రద్ద పెడుతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది. దిల్‌రాజు ఇంత శ్రద్ద పెట్టిన ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి. దసరా సందర్బంగా ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

hello-guru-prema-kosame