బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమా ఎట్టకేలకి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కలెక్షన్లు కూడా బాగా వస్తున్నాయి. ఈ క్రమంలో కంగనా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా టికెట్ ని కేవలం రూ.99కు తగ్గించాలని కంగనా నిర్ణయం తీసుకుంది. దీంతో, ఈ మూవీ మరింత మంది ప్రేక్షకులకు చేరే అవకాశం ఉంది.
కాగా ఈ సినీమా లో అనుపమ్ ఖేర్, శ్రేయస్ తల్పాడే, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, అధిర్ భట్, విశాఖ్ నాయర్ వంటి నటులు నటించారు. ప్రతి నటుడు ప్రముఖ రాజకీయ పాత్రలకి ప్రాణం పోశారనే చెప్పవచ్చు. కాగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తం ఆధారంగా ఈ సినిమా ని తీసుకువచ్చారు. ఏది ఏమైనా ఈ సినిమా లో కంగనా తన నటనతో అందరినీ నుంచి ప్రశంసలు అందుకుంది.