Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పటిన తర్వాత కన్నా మొదటిసారిగా ప్రధానితో భేటీ అయ్యారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మోడీకి తెలిపానని 2019 ఎన్నికలలో ఏపీలో బిజెపిని అధికారం లోకి తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం… చేస్తున్నాం… చేశాం… చేస్తామని మోడీ తెలిపారని కన్నా మీడియాకి తెలిపారు. చంద్రబాబు మోసం చేసినా రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మోడీ ఏపీ ప్రజలకు చెప్పమని తెలిపారని కన్నా పేర్కొన్నారు.
విభజన చట్టంలో ఉన్న 85 శాతం అంశాలు పూర్తి చేశామని ఏపీ ప్రజల వెంట తాను ఉంటానని మోడీ తెలిపారని కన్నా పేర్కొన్నారు. ఏపీకి సంబంధించిన 12 అంశాలు పూర్తి చేయాలని ప్రధానికి నివేదిక ఇచ్చానని ఆయన సదరు విజ్ఞాపన పత్రాన్ని మీడియాకి రిలీజ్ చేశారు దాని ప్రకారం వైజాగ్ రైల్వే జోన్,కడప స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం,విశాఖ,విజయవాడలో మెట్రో రైలు,పెట్రో కెమికల్ కాంప్లెక్స్, వెనుకబడిన జిల్లాలలకు 50 కోట్ల నుంచి 150 కోట్లకు నిధుల పెంపు,విద్యాసంస్థలకు నిధుల కేటాయింపు, రామాయపట్నం పోర్టు,వెనుకబడిన జిల్లాలలకు జిఎస్టీ టాక్స్ ఇన్సెన్టివ్స్,నాలుగు రాయలసీమ జిల్లాలకు పారిశ్రామిక కారిడార్,గిరిజన,మత్స్య కారులకు అభివృద్ధికి నిధులు,స్టర్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లకు పన్ను రాయితీలు ఇవ్వాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు.