ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు మహిళలు క్యాస్టింగ్ కోచ్ అనే ఒక సమస్య మీద పోరాటం చేస్తున్న సమయంలో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ పరువు తీసే ఘటన ఒకటి వేలుగులోకి వచ్చింది. సినిమాల్లో విలన్ వేషాలు వేసే ఒక నటుడు షూటింగ్ ఉందని చెప్పి ఒక రోజు రాత్రి ఓ నటీమణి ఇంటికి కారు పంపాడు. తీరా వచ్చాక తర్వాత షూటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పి డిన్నర్ పెట్టి భోజనంలో, డ్రింక్స్‌లో డ్రగ్స్ కలిపి ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోయాక ఆమె శరీరంతో అశ్లీల వీడియో చిత్రీకరించాడు. ఒక రోజు తర్వాత మెలకువ వచ్చాక ఆ వీడియో చూపించి డబ్బులు ఇవ్వమంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. అలా చేస్తూ చేస్తూ ఏడాది కాలంలో రూ.14 లక్షలు రాబట్టాడు. ఇంకా డబ్బులు ఇవ్వాలన్నాడు, బాధితురాలు భర్తకు విషయం చెప్పడంతో ఇంటికొచ్చి బెదిరించాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కన్నడ చిత్ర సీమలో సంచలనం సృష్టించిన ఈ ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది.
అయితే ఆ నటి ఎవరు అనేది ప్రస్తుతానికి వెలుగులోకి రాకపోయినా ఆ విలన్ పేరు మాత్రం ధర్మ అలియాస్ ధర్మేంద్ర అతను కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరున్న నటుడు. డ్యాన్స్ కొరియో గ్రాఫర్‌గానూ పని చేశాడు. సుదీప్ సినిమా ‘హుచ్చా’తో మంచి క్యారక్టర్ రావడంతో తరువాతి కాలంలో విలన్‌గా బిజీ అయిపోయాడు. గతేడాది మార్చి 1న షూటింగ్ కోసమని విలన్ వేషాలు బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌లోని ఓ ప్రాంతానికి ఆ నటిని తీసుకెళ్ళిన ధర్మ కారు డ్రైవర్ నవీన్ ‘షూటింగ్ స్పాట్’కి వచ్చాక షూటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పాడు. మరలా బయలుదేరమంటే ధర్మ ఆ నటిని డిన్నర్ చేసి వెళ్లమన్నాడు. ఆమెకు పెట్టిన ఫుడ్, డ్రింక్స్‌లో డ్రగ్స్ కలిపారు. దీంతో ఆమె స్పృహ కోల్పోగా ఆమె స్పృహలో లేని సమయంలో ఆమె శరీరంతో అసభ్యకరమైన రీతిలో వీడియో చిత్రీకరించాడు. తర్వాత ఆమెని బెదిరించి డబ్బు గుంజాడు. ఇంకా గుంజాలని చూడడంతో భరించలేక రెండు నెలల క్రితమే బాధితురాలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా పేరున్న నటుడు కావడంతో పోలీసులు లైట్ తీసుకున్నారు. విషయం మీడియాకు పొక్కడంతో ఇటీవలే ఎట్టకేలకు ధర్మ, కారు డ్రైవర్ నవీన్‌లపై కేసు నమోదు చేశారు.