కాపులకి ‘త్రిమూర్తుల’ పరీక్ష

kapu community stand on 2019 elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

కంభంపాటి హరిబాబు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నాటినుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. ఆనాటి నుండి ఏపీ అధ్యక్షుడి నియామకం జరుగుతుందనే మాట వినబడుతూనే ఉంది. కర్నాటక ఎన్నికల పోలింగ్ పర్వం పూర్తయిన మరు రోజనే కన్నా లక్ష్మీనారాయణని ఏపీ అధ్యక్షునిగ నియమించింది ఆ పార్టీ అధిష్టానం. అయితే కొన్నాళ్లుగా సాగిన ఊహాగానాలకు భిన్నంగా సోము వీర్రాజును కాదని కాంగ్రెస్ నుండి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు కిరీటం కట్టబెట్టారు. ఎప్పటికైనా సరే..ఏపీ బీజేపీ అధ్యక్ష్యుడి పదవి నాదే అని ధీమాగా ఉన్న సోము వీర్రాజుకు ఎన్నికల కమిటీ కన్వీనర్ పదవినిచ్చి ఊరుకోబెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాజపాకు ఎలాంటి గుర్తింపు లేనిరోజుల నుంచి పార్టీ కోసం పాటుపడిన వారు కూడా ఉన్నారు. భాజపాని ఎంతో కాలంగా నా పార్టీ అని భావిస్తూ సొంత ఖర్చులతో పార్టీ ఆఫీస్లని నడిపిస్తున్న వారు ఎందఱో ఉన్నారు కానీ అమిత్ షా మాత్రం అలాంటి వారినందరినీ పక్కన పెట్టి వేరే పార్టీ నుండి అరువు తెచ్చుకున్న కన్నా లక్ష్మి నారాయణని ఏపీ బీజేపీ అధ్యక్ష్యుడిని చేశారు. అయితే ఇక్కడ మాత్రం భాజపా కేవలం కుల రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తోందని అనడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారు.

అంటే భారతీయ జనతాపార్టీ కాపులనే టార్గెట్ చేసుకుంది. నిజానికి వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిగా పంపేయడానికి, కంభంపాటి హరిబాబును ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దింపేయడానికి కారణం సామాజిక సమీకరణలే అన్న ప్రచారం సాగుతోంది. ఏపీలో రెడ్లు, కమ్మలతో ధీటుగా బలంగా ఉన్న కాపు సామాజికవర్గాన్ని తమ దరికి చేర్చుకుంటే.. బలీయమైన శక్తిగా ఎదగొచ్చన్నది ఆ పార్టీ వ్యూహం అనుకోవచ్చు. అందుకే ఆ వర్గం నుంచి ప్రభావవంతమైన వ్యక్తిని ఏపీ బీజేపీ అధ్యక్షునిగా నియమించాలనుకున్నారు. అంటే సోము వీర్రాజు కూడా అదే సామాజిక వర్గమే అయినా సోము నోరు వేసుకుని పడిపోవడమే తప్ప ఏ విషయం అయినా సాధ్యాసాధ్యాలు ఆలోచించి మాట్లాడరు అనే పేరుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్నా లాంటి నాయకుడు అయితే మాటలతో మాయ చేయగలడు అని బీజేపీ ఆదిస్థానం భావిస్తున్నట్టు ఉంది, గోదావరి జిల్లాల్లో ఆ పార్టీకు ఉన్న నేతలంతా.. ఆ సామాజివర్గమే. కానీ …వారికి వారి సామజికవర్గంలోనే పలుకుబడి లేదు. అందుకే కన్నా లక్ష్మినారాయణ వైపు మొగ్గారు. రాజీనామా చేసినా… బుజ్జగించి.. పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు.

దీంతో ఇప్పుడు పవన్‌కు పోటీగా కాపులను బీజేపీ వైపు ఆకట్టుకునే బాధ్యత కన్నాపై పడింది. మరో వైపు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్లాట్ ఫాం సిద్దం చేసుకుంటున్నారు. సొంతంగా రాజకీయ పార్టీ పెడతారా? మరో పార్టీలో చేరుతారా? లేక రాజకీయాలకు దూరంగా ఉండి ఏదైనా స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనలో ఉన్నారా? అన్న ఓ విలేఖరి ప్రశ్నకు ఆయన తెలివిగా సమాధానం ఇచ్చారు. రెండున్నర నెలల తరువాత. ఈ మూడింటితో పాటు ‘నన్ ఆఫ్ ది ఎబౌ’ కూడా ఉండవచ్చు. వెయిట్ అండ్ వాచ్ ఏదయినా 75 రోజుల తరువాతే బయట పెడతానని ఆయన ప్రకటించడం ఆయన రాజకేయల్లోకి రావడానికి సిద్దం అవుతున్నారు అనుకోవచ్చు. బహుశా ఆయన ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ తరపునో. లేదా ఆయనే సొంతంగా అలాంటి పార్టీనో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన సామాజివర్గం కూడా కన్నా సామాజిక వర్గమే. ఆయన రాజకీయ బరిలోకి దిగాక ఆయన తనకు కులం, మతం లేదన్నా అండగా ఉండాల్సింది కాపు సామాజికవర్గమే. సో అప్పుడు సదరు సామాజిక వర్గం పవన్, కన్నా, జేడీ లలో ఎవరిని నెత్తిన పెట్టుకుంటుందో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే..