కరణం బలరామ్ కి రెండు పెళ్ళిళ్ళు…నలుగురు సంతానం ?

karanam balaram married two times

చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ ఎన్నిక చెల్లదంటూ వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే . కరణం బలరాం అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని కరణం బలరామ్ కు నలుగురు సంతానమని ఆరోపిస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో కేవలం ముగ్గురు అని మాత్రమే ఉన్నారని చూపించారని ఆరోపించారు. అందుకు సంబంధించి ఆధారాలను సైతం హైకోర్టుకు సమర్పించి కరణం బలరాంపై అనర్హత వేటు వేయాలని తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక అంతే కాదు ఈ రోజు మీడియాతో కరణం బలరాం ఎన్నిక చెల్లదు అని అందుకు గల కారణాలను తెలియజేశారు ఆమంచి కృష్ణమోహన్.  విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమంచి, తన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను మీడియా ముందు ఉంచారు . ఎన్నికల అఫిడవిట్ లో ఒక భార్య పేరును కరణం సరస్వతిగా పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆయనకున్న మరో భార్య ప్రసూన గురించి ప్రస్తావించలేదని ఆయన అన్నారు. తనపై ఆధారపడి జీవిస్తున్నవారు ఎవరూ లేరని తెలిపారని, ప్రసూన గురించి, ఆమె ఆదాయం, ఆస్తి, అప్పుల గురించి వివరించలేదని పేర్కొన్నారు. పలువురు ప్రముఖులు, కుటుంబసభ్యుల సమక్షంలో 1985లో ప్రసూనతో బలరామకృష్ణ మూర్తి వివాహం శ్రీశైలంలో జరిగిందన్న ఆమంచి కరణం బలరాం, ప్రసూనలకు అంబిక 1989లో హైదరాబాద్‌లోని సెయింట్‌ థెరిస్సా ఆస్పత్రిలో జన్మించిందని తెలిపారు. ఇక అంబిక ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌లో, ఆధార్‌ కార్డులో తండ్రి పేరు కరణం బలరామకృష్ణ మూర్తి అని ఉందని ఆయన పేర్కొన్నారు. అంబిక అన్నప్రాసన, మొదటి పుట్టినరోజు వేడుకలు, అక్షరాభ్యాస వేడుకలకు సంబంధించిన ఫొటోల్లోనూ బలరామ్ ఉన్నారని వాటిని చూపించారు. అంబిక కృష్ణ ప్రస్తుతం ఎల్‌ఎల్‌బీ చదువుతోందని చెప్పిన ఆయన కరణంకు ఇంకో కూతురు ఉందని అందుకు కావాల్సిన ఆధారాలను బయటపెట్టారు. ఎన్నికల చట్ట నిబంధనల ప్రకారం కరణం నామినేషన్‌ను చట్ట ఆమోదయోగ్యమైన నామినేషన్‌గా పరిగణించడానికి వీల్లేదని పేర్కొన్న ఆమంచి ఆయన నామినేషన్‌ను చెల్లనిదిగా ప్రకటించాలి. బలరాం ఎన్నికను రద్దు చేయండి అంటూ తన పిటిషన్‌లో వివరించారు.