‘రంగస్థలం’ బాలీవుడ్‌ మార్కెట్‌ కోసం కరీనా కపూర్‌!

kareena kapoor item song

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘రంగస్థలం 1985’. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా ముఖ్య పాత్రలో అనసూయ కనిపించబోతుంది. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ ఒక పల్లెటూరు కుర్రాడిగా నటిస్తున్నాడు. ఇప్పటి వరకు రామ్‌ చరణ్‌ చేయని ఒక విభిన్నమైన కథ మరియు పాత్రతో ఈ సినిమా తెరకెక్కుతుంది. సుకుమార్‌ సినిమా అంటేనే ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా, అంచనాలను అందుకునేలా ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఒక చేపలు పట్టుకునే కుర్రాడిగా రామ్‌ చరణ్‌ కనిపిస్తాడని అంటున్నారు. ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌తో ఐటెం సాంగ్‌ చేయించి అంచనాలు మరింతగా పెంచేస్తున్నారు.

హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో 10 కోట్ల వ్యయంతో ఒక భారీ విలేజ్‌ సెట్టింగ్‌ను వేయడం జరిగింది. ఆ విలేజ్‌ సెట్స్‌లో కరీనా కపూర్‌ ఐటెం సాంగ్‌ చేయబోతుంది. ఈ పాట కోసం కరీనా ఏకంగా 2.5 కోట్లు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేవలం వారం రోజు డేట్లు ఇచ్చి ఈ స్థాయిలో పారితోషికాన్ని అందుకోబోతుంది. ఇంత మంది స్టార్‌ హీరోయిన్స్‌ ఉండగా ఎందుకు సుకుమార్‌ ఆమెను ఎంపిక చేసుకున్నాడు అనే విషయంపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో కూడా డబ్‌ చేయాలని దర్శకుడు మరియు నిర్మాతలు కోరుకుంటున్నారు. అందుకే ఈ సినిమా కోసం అక్కడి స్టార్స్‌ను వినియోగించుకుంటున్నారు.

హిందీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు కరీనా కపూర్‌తో ఐటెం సాంగ్‌ చేయించాలని నిర్ణయించుకున్నారు. కాస్త ఎక్కువ పారితోషికం అయినా పర్వాలేదని, హిందీలో ఈమె కారణంగా ఖచ్చితంగా మంచి క్రేజ్‌ దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ చిత్రం రామ్‌ చరణ్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. సంక్రాంతి సందర్బంగా ఈ చిత్రాన్ని వచ్చ సంవత్సరం జనవరి మూడవ వారంలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తెలుగు సినిమాకు ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా ఉంటుందని, చరణ్‌ పాత్ర, సమంత నటన, కరీనాకపూర్‌ ఐటెం సాంగ్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి అంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.