వోగ్ పై గ్లామరసం ఒలికిస్తున్న కరీనా…!

Kareena Kapoor Khan To Join Politics

కరీనా కపూర్ గురించి చెప్పుకోవాలంటే బాలీవుడ్ లో జీరో సైజ్ ని పరిచయం చేసి, తన గ్లామర్ తో యువహృదయాలను కొల్లగొట్టిన సుందరి అని చెప్పొచ్చు, అంతేకాకుండా 38 వయస్సులో, ఒక బాబు కి జన్మనిచ్చిన తరువాత కూడా ఒకప్పటి తన జీరో సైజ్ కి రావడానికి జిమ్ లో నిరంతరం శ్రమించే ఫిట్నెస్ ఫ్రీక్ అనొచ్చు, ఇప్పుడున్న యువ నటీమణులతో సమానంగా గ్లామర్ ని ప్రదర్శించే అసలు సిసలైన బాలీవుడ్ నటిగా పేర్కొనచ్చు.

Kareena-Kapoor-Khan

అటువంటి కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకొని, తైమూర్ అనే బాబు కి తల్లయ్యాక కూడా, తనకి మాత్రమే ప్రత్యేకమైన జీరో సైజు లో వోగ్ ఇండియా మ్యాగజిన్ పైన తన గ్లామరసాన్ని ఒలికిస్తున్న తీరు ఇప్పుడు యువకుల హృదయాలను మరోసారి గిలిగింతలు పెడుతూ, కట్టిపడేస్తుంది. అదేమిటో కరీనా కపూర్ ఎంత గ్లామరసం ఒలకబోసిన ఎబ్బెట్టుగా అనిపించదు.

vogue

అలా అని మనసు నిండదు. ఏదో ప్రత్యేకత ఉంటుంది కరీనా కపూర్ లో…ఈ ప్రత్యేకత ఐశ్వర్య రాయ్ తరువాత కరీనా కపూర్ లోనే కనిపిస్తుంది అనిపిస్తుంది.వోగ్ ఇండియా మ్యాగజిన్ తన నవంబర్ సంచికలో కరీనా కపూర్ ని విమెన్ అఫ్ ది ఇయర్ 2018 గా అభివర్ణించి, కవర్ పేజీ పై ప్రచురించిన పిక్ లో కరీనా కపూర్ కనిపించినంత హాట్ గా ఇంకే నటి కనిపించలేదేమో అనిపించేలా కనిపించింది.2018 లో కరీనా నటించిన వీరే ది వెడ్డింగ్ అనే అడల్ట్ డ్రామా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించి 100 కోట్ల పైచిలుకు వసూళ్లను సాధించింది. ఆ సినిమాలో కూడా జీరో సైజ్ లో హాట్ గా కనిపించే కరీనా కపూర్ ని చూడటం మిస్ అయిన తన అభిమానులు ప్రస్తుతానికి అంతకు మించిన హాట్ గా కనిపించిన కరీనా వోగ్ ఇండియా మ్యాగజిన్ గ్యాలరీ ని చూసి ఆనందించండి.

kareena-kapoor