#RC12 ఫస్ట్ లుక్ – రాంచరణ్ ఇక “వినయ విధేయ రామ”

వినయ విధేయ రామ – భలే ఉందే అచ్చ తెలుగు సినిమా పేరులా అనిపిస్తుంది కదా. అవునండీ, రామ్ చరణ్ తన 12 వ సినిమాలో రాముడు అనే పాత్రలో నటిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజే విడుదలయ్యింది. ఆ పోస్టర్ లోనే ఈ సినిమా పేరు “వినయ విధేయ రామ” అని రివీల్ చేశారు. ఈ సినిమాకి దర్శకుడు బోయపాటి శ్రీను. ఈయన తీసిన గత చిత్రానికి కూడా “జయ జానకి నాయక” అని ఆసక్తికరమైన తెలుగు టైటిల్ ని పెట్టిన బోయపాటి శ్రీను తాను రామ్ చరణ్ తో తీస్తున్న సినిమాకి కూడా ఆసక్తికరమైన తెలుగు టైటిల్ పెట్టడం అనే సెంటిమెంట్ ని కొనసాగించారు.

#RC12 ఫస్ట్ లుక్ - రాంచరణ్ ఇక "వినయ విధేయ రామ" - Telugu Bullet

ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ గురించి మాట్లాడితే, రామ్ చరణ్ ని బోయపాటి శ్రీను తనకి అలవాటైన యాక్షన్ హీరో పాత్రలోనే చూపిస్తున్నాడని అర్ధం అవుతుంది. రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ని చూడగానే, జయ జానకి నాయక లో కార్ డోర్ పట్టుకొని పరుగెడుతున్న బెల్లంకొండ శ్రీనివాస్ లుక్కే గుర్తుకువస్తుంది అందడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇదనే కాకుండా సరైనోడు సినిమాలో డంబెల్స్ పట్టుకొని, ఫైట్ చేయబోతున్న అల్లు అర్జున్ లుక్ కూడా గుర్తుకు వస్తుంది. అయినా, ఈ బోయపాటి శ్రీను ఒకేరకమైన యాక్షన్ సినిమాలను అటుఇటుగా తీస్తాడని తెలుసు కానీ మరీ ఫస్ట్ లుక్ పోస్టర్లని కూడా ఒకేలా రిలీజ్ చేస్తాడని మరోసారి తెలుస్తుంది.

RC12-firstlook

రామ్ చరణ్ లుక్కు గురించి మాట్లాడుకుంటే మనకి ఎవడు సినిమాలో రామ్ చరణ్ ఎలా కనిపించాడో అలానే కనిపిస్తున్నాడు. కాకుంటే కాస్త గడ్డం, ఇంకాస్త ఒళ్ళు పెంచాడంతే. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. బోయపాటి శ్రీను గత రెండు సినిమాలకి సినిమాటోగ్రఫీ అందించిన రిషి పంజాబీ నే మళ్ళీ ఛాయాగ్రహణం అందిస్తున్నాడు.