తైమూర్ క్రియేటివిటీ చూసి ముక్కున వేలేసుకుంటున్న నెటిజన్స్

తైమూర్ క్రియేటివిటీ చూసి ముక్కున వేలేసుకుంటున్న నెటిజన్స్

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ తన సోషల్ మీడియా వేదికగా సరికొత్త విషయాన్ని షేర్ చేసింది. తన కుమారుడు తైమూర్ అలీ ఖాన్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్‌ను ఎప్పటికప్పుడు కరీనా తన అభిమానులతో పంచుకుంటుంటుంది. తాజాగా తైమూర్ తనకు గిఫ్ట్ ఇచ్చిన విషయాన్ని కూడా కరీనా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తైమూర్ తనకు ఓ హారాన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడన్న విషయాన్ని కరీనా తెలిపింది. తైమూర్ ఇచ్చిన హారాన్ని మెడలో ధరించి ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ హారాన్ని మూడేళ్ళ తైమూర్ స్వయంగా తయారు చేసాడని కరీనా చెబుతుంది.

మూడేళ్ల తైమూర్ క్రియేటివిటీ చూసి నెటిజన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. చాలా టాలెంట్ ఉన్నఆ కిడ్ అంటూ పలువురు తైమూర్‌ని ప్రశంసిస్తున్నారు. చిన్న వయస్సులోనే స్టార్ స్టేటస్ పొందిన కరీనా కపూర్‌- ఆతర్వాత బాలీవుడ్ చోటా నవాబ్ సైఫ్‌ అలీఖాన్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కరీనా సైఫ్‌కు రెండో భార్య. వీరిద్దరి ముద్దుల తనయుడు తైమూర్‌ అలీఖాన్‌. చిన్నప్పటి నుండే ఫుల్ క్రేజ్ పొందిన ఈ బుడతడు త్వరలో ఇంగ్లండ్‌లోని బోర్డింగ్ స్కూల్‌లో చదవనున్నట్టు తెలుస్తుంది. పటౌడీ కుటుంబ సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరు అక్కడ విద్యనభ్యసిస్తున్న క్రమంలో తైమూర్‌ని కూడా ఇంగ్లండ్‌కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కరీనా సైఫ్. తైమూర్ ప్రస్తుతం ముంబైలోని పాఠశాలలో చదువుతున్నాడు.