Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Karnataka Fight against Hindi
స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. అప్పట్నుంచే ఉత్తర, దక్షిణ ధృవాల మధ్య అపనమ్మకం మొదలైంది. ఆ తర్వాత మహారాష్ట్రలో స్వీయ అస్తిత్వంతో ప్రాంతీయవాదాన్ని తట్టిలేపిన శివసేన.. మరాఠాల గుండెల్ని మండించింది. ముంబైలో ఉన్న ఉత్తర భారతీయులపై దాడులు చేయడం, స్థానికులకు లోకల్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించడం వంటి దందాలు చేసింది. ప్రస్తుతం శివసేన కాస్త బలహీనపడ్డా.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇప్పుడు విద్వేషాగ్ని ఎగసిపడుతోంది.
కర్ణాటకలో బీజేపీకి అధికారం ఖాయమని సర్వేలన్నీ తేల్చిచెప్పాయి. సీఎం సిద్ధరామయ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే ప్రాంతీయవాదాన్ని తట్టిలేపాడు. ఎక్కడా లేని విధంగా తమ రాష్ట్రానికి జెండా ఉంటే తప్పేంటని వాదించాడు. అంతటితో ఆగకుండా కర్ఠాటకలో ఉన్న హిందీ బోర్డులకు నల్ల రంగు వేయించాడు. ఇప్పుడు ఏకంగా ఇతర రాష్ట్రాల నుంచి కేంద్ర పరీక్షలు రాయడానికి వచ్చిన అభ్యర్థులపై దాడులు కూడా చేయిస్తున్నాడు సిద్ధరామయ్య.
గతంలో కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంని మార్చాలంటే.. పాతబస్తీలో మతకలహాలు లేవదీయడం ఓ ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడు సిద్ధరామయ్య కూడా ఎన్నికల్లో గెలవాలంటే.. కన్నడిగులు, ఇతరుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనుకోవడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు దేశానికి ఐటీ హబ్ గా ఉంది. అలాంటి నగరంలో ఇలాంటి దాడులు జరిగితే భవిష్యత్తులో బ్రాండ్ ఇమేజ్ పై దెబ్బ పడుతుందని, కనీసం కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఈ విషయంలో స్పందించకపోవడం శోచనీయమంటున్నారు ఎనలిస్టులు.
మరిన్ని వార్తలు:
బాలుడి హత్య కేసుః నిందితుడి అరెస్ట్
సెప్టెంబరు 9 సచిన్ కు ఎంతో ప్రత్యేకం