పద్మావత్‌కు ప్రతీకారంగా కర్ణి సేన మూవీ

Karni Sena To Make A Film on Bhansali Mother Leela Ki Leela

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
గత కొన్ని నెలలుగా పద్మావత్‌ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న విషయం తెల్సిందే. షూటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుండి కూడా సినిమాను అడ్డుకునేందుకు కర్ణిసేన ఎన్నో ప్రయత్నాలు చేసింది. షూటింగ్‌ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి దాడులు చేశారు, విడుదల సమయంలో కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేశారు. ఏం చేసినా కూడా పద్మావత్‌ చిత్రాన్ని సుప్రీం కోర్టు విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో రిపబ్లిక్‌ డే సందర్బంగా విడుదల అయిన విషయం తెల్సిందే. సినిమా విడుదలైన తర్వాత కూడా కర్ణి సేన తగ్గడం లేదు. తాము అమ్మగా భావించే పద్మావతిని అవమానించారు అంటూ కర్ణి సేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలైన తర్వాత వారు కొత్త రూపంలో తమ నిరసన తెలియజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

తమ అమ్మ గురించి సినిమా తీసి అవమానించిన సంజయ్‌ లీలా భన్సాలీపై ప్రతీకారంగా ఆయన తల్లిపై సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. అయితే సంజయ్‌ లీలా భన్సాలీ తల్లి గురించి అవమానిస్తూ కాకుండా ఆమె గొప్పదనంను చూపిస్తూ సినిమా తీస్తామని కర్ణి సేన అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ చెప్పుకొచ్చాడు. అమ్మను గౌరవించని వ్యక్తి దైవంను ఎలా గౌరవిస్తాడని, సంజయ్‌ లీలా భన్సాలీకి దైవంను ఆరాధించే హక్కు లేదు అంటూ గోవింద్‌ పేర్కొన్నారు. రెండు వారాల్లో భన్సాలీ తల్లి జీవిత చరిత్రతో సినిమాను మొదలు పెడతామని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై భన్సాలీ ఎలా స్పందిస్తాడు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. మరోవైపు ‘పద్మావత్‌’ చిత్రంలో పద్మావతికి వ్యతిరేకంగా ఎలాంటి సీన్స్‌ లేవని, ఆమె గొప్పదనంను చూపించే విధంగానే సినిమా ఉందని, కర్ణి సేన పబ్లిసిటీ కోసం వివాదంను సృష్టిస్తుందని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.