జ్యోతికకి తమ్ముడు కానున్న కార్తీ !

జయాపజయాలను పెద్దగా పట్టించుకోకుండా వరుస సినిమాలను చేస్తూ వెళుతున్నాడు కార్తీ. ఆయన తాజా సినిమా ఖైదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన చేయనున్న సినిమాలో జ్యోతిక ఒక కీలకమైన పాత్రను పోషించనుందనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. జ్యోతిక సోదరుడిగా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడని అంటున్నారు. మలయాళ దర్శకుడు దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకి జ్యోతిక సోదరుడు సూరజ్ నిర్మాతగా వ్యవహరిస్తాడట. ఇక ఈ సినిమాలో కథానాయిక ఎవరు? మిగతా పాత్రల్లో ఏయే నటీనటులు కనిపించనున్నారు ? అనే విషయాలు త్వరలోనే తెలియనున్నాయి. నిజ జీవితంలో జ్యోతికకి మరిది అయిన కార్తీ ఆమెకి సోదరుడిగా నటించడం ఆసక్తిని కలిగించే విషయమే.