ఎట్టకేలకి విడిపోయారు ?

ఎట్టకేలకు హాలీవుడ్ న‌టులు ఏంజెలినా జోలీ బ్రాడ్ పిట్ లు అధికారికంగా వేరయ్యరు. వీరిద్దరికీ అక్కడి అత్యున్నత న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. తమను చట్టపరంగా సింగిల్స్ గా కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ చేయడంతో వారి విన్నపాన్ని జడ్జి అంగీకరించారు. ఇద్దరూ తమ పిల్లలకు ఏది బెస్ట్ అనే విషయాలపైనే పూర్తి ఫోకస్ పెట్టినట్లు హాలీవుడ్ మీడియా కథనం ప్రచురించిది. ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్ తమ ఆరుగు పిల్లలకు మడోక్స్, పాక్స్, జహారా, షిలోతో పాటు కవలలు నోక్స్, వివిన్నేలకు సంబంధించిన బాధ్యతలను పంచుకోబోతున్నారు. వాస్తవానికి వీరి విడాకుల వ్యవహారం ఇంతకాలం కొలిక్కి రాకపోవడానికి కారణం పిల్లలు, ఆస్తులే. ఏంజెలీనా జోలీ పిల్లల సంరక్షణ తనకే అప్పగించాలని డిమాండ్ చేసింది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. పిల్లల పెంపకం, వారి ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో విడాకుల కేసు సాగుతూ వచ్చింది. 2018 జూన్లో ఒక జడ్జి పిల్లలను కలవడానికి బ్రాడ్ ఫిట్‌కు షెడ్యూల్ రూపొందించారు. అయితే మడోక్స్ విషయంలో మాత్రం అతడి వయసు దృష్ట్యా తన తండ్రితో కలిసి ఎంత సమయం గడపాలి అనేది అతడే నిర్ణయించుకునే విధంగా వెసులుబాటు కలిగించారు.