టాలీవుడ్ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో శ్రీరాముడిపై అనుచిత వ్యాక్యలతో పోస్టు చేసినందుకుగాను ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అతడితని వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కాగా ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఐపీఎస్ సెక్షన్ 153(ఎ) కమ్యూనల్ యాక్ట్ కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.