వివాదాస్పద క్రిటిక్.. బిగ్ బాస్ ఫేస్ కత్తి మహేష్ కత్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. జూన్ 26 తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. వెంటనే ఆయన్ని నెల్లూరులోని మెడికవర్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. కత్తి మహేష్ తలకు, కళ్లుకి బలమైన గాయాలు కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం వెంటిలేటర్‌పై వైద్యం అందిస్తుండగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించనున్నట్టు కత్తి మహేష్ సోదరి తెలిపారు. కాగా ప్రమాద సమయంలో కత్తి మహేష్‌తో పాటు కారు డ్రైవర్ కూడా ఉన్నట్టు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కత్తి మహేష్ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతోనే బలమైన గాయాలు అయ్యాయని.. కారుకి అడ్డంగా ట్రక్ వచ్చేసరికి డ్రైవింగ్ సీట్లో ఉన్నాయన సేఫ్‌గానే ఉండగా.. కత్తి మహేష్ తలకి బలమైన గాయాలయ్యాయి. ఒక కన్ను పూర్తిగా డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది.
నిజానికి కత్తి మహేష్.. ఎక్కువగా క్యాబ్‌లు ఆటోలలోనే జర్నీ చేస్తుంటారు. ఆయనకి డ్రైవింగ్ కూడా సరిగా రాదని.. సినిమా రివ్యూలు ఇతర ఫంక్షన్లు, షూటింగ్‌లకు క్యాబ్‌లోనే వస్తుంటారని.. సొంతం కారులో డ్రైవ్ చేస్తూ వచ్చిన దాఖలాలు లేవని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు.
అయితే కత్తి మహేష్ తొందరగా కోలుకోవాలని కుంచే రఘుతో పాటు పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే మెగా ఫ్యామిలీని.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను తరచూ విమర్శించి వార్తల్లో నిలిచే కత్తి మహేష్.. ఇప్పటీ ఆ వైరాన్ని కొనసాగిస్తూనే ఉండటంతో.. పలు మెగా గ్రూపుల్లో కత్తి మహేష్ యాక్సిడెంట్ ఇష్యూ హాట్ టాపిక్ అవుతుంది.