Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సంక్రాంతి సీజన్‌కు రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయి, పండగను మరింత జోష్‌తో చేసుకోవచ్చు అని భావించిన ప్రేక్షకులకు తీవ్ర నిరాశే మిగిలింది. సంక్రాంతి సీజన్‌ను పవన్ తన అజ్ఞాతవాసి చిత్రంతో మొదలు పెట్టాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కా బోర్లా పడటం జరిగింది. సీరియస్ కథను సిల్లీ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించడంతో సినిమా దొబ్బింది. ఇక నేడు బాలయ్య ‘జైసింహా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్‌తో బాలయ్య పవర్ చూపించడం ఖాయం అని అంతా భావించారు. కాని బాలయ్య సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల్ల పడిపోయింది. సినిమా చాలా మూసగా ఉందని, ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేదంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఏ సినిమా విడుదలైనా కూడా అంతా కూడా కత్తి మహేష్ రివ్యూ ఏంటా అంటూ ఇటీవల ఎదురు చూస్తున్నారు. ఉదయం బెన్‌ఫిట్ షో చూసిన కత్తి మహేష్ ఉదయం 10 గంటలకే తన రివ్యూను ట్విట్టర్ ద్వారా ఇచ్చేశాడు.
కత్తి మహేష్ ‘జైసింహా’ గురించి ట్విట్టర్‌లో…
80ల కథకి, 90ల కథనం. గతిలేని కథ. గమనం లేని కథనం. వెరసి ఒక కలగురగంప సినిమా “జై సింహ”. నిరర్ధకమైన కథలోని అసంబద్ధమైన పాత్రలో బాలయ్య. ఎందుకు ఉన్నామో తెలీని హీరోయిన్లు ముగ్గురు. అజ్ఞాతంలోకి మరో సంక్రాంతి సినిమా!
కత్తి మహేష్ రివ్యూతో సినిమా ఫలితం తేలిపోయింది. అజ్ఞాతవాసి చిత్రానికి కూడా కత్తి మహేష్ ఇలాంటి రివ్యూనే ఇచ్చాడు. ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు కూడా కత్తి మహేష్ రివ్యూతో ఏకీభవించారు. కత్తి మహేష్ చెప్పినట్లుగా బాలయ్య కూడా అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయాడు. ఇక సంక్రాంతి బరిలో ఉన్న మిగిలిన రెండు సినిమాలైనా ఆకట్టుకుంటాయేమో చూడాలి.