కట్టప్ప అరెస్ట్…ఇదీ నిజం…!

Kattappa Arrested For Posting Controversial Photo Of Pm Modi

తనకు ఎవరో పంపిన ఓ మోడీ ఫొటోను పోస్టు చేస్తే దాని మీద వివాదం చెలరేగి సినీ నటుడు, కట్టప్ప ఫేం సత్యరాజ్ అరెస్టై, రిమాండ్ కు వెళ్లినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి చిత్రంలో కట్టప్పగా నటించి పేరు తెచ్చుకున్న నటుడు, ఎండీఎంకే నాగపట్టణం జిల్లా ఇన్ చార్జ్‌ సత్యరాజ్‌ అలియాస్‌ బాలును నిన్న తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనను వ్యతిరేకిస్తూ, ఆయన ఓ చిప్ప పట్టుకుని అడుక్కుంటున్నట్టు ఉన్న ఫొటోను సత్యరాజ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారని వార్తలు రాగా అదంతా ఒత్తిదే అని అంటున్నారు. నిజానికి సత్యరాజ్ పూర్తి పేరు రంగరాజు సుబ్బయ్య . అయితే ఆయన వైగోకి చెందినా ఎండీఎంకే కి మద్దతుదారుడే కావడంతో ఆయన అనుకుని పొరబడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఏదేమైనా ఆయన స్వయంగా క్లారిటీ ఇస్తే గానీ ఈ విషయం తేలదేమో.