టీవీ నటుడు, మోడల్ కౌశల్ బిగ్‌బాస్ షోతో ఊహించని పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. కేవలం ఒకే ఒక్క నిమ్మకాయ ఎపిసోడ్‌తో కౌశల్ దశ తిరిగిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఫలితంగా బిగ్‌బాస్ సీజన్-2 విన్నర్‌గా టైటిల్ సొంతం చేసుకున్నాడు. అయినప్పటికీ అవకాశాల విషయంలో పెద్ద మార్పు కనిపించలేదు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కౌశల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
‘బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన తర్వాత ఎవరూ చేయని విధంగా తన గెలుపు కోసం కష్టపడిన వారందరిని కలిసిశానని కౌశల్ పేర్కొన్నాడు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్లు కూడా నాకోసం నిలబడ్డారు. అందుకే అక్కడికి వెళ్లి మరీ నా కృతఙ్ఞత తెలుపుకున్నా. ఇక సినిమాల విషయానికి వస్తే.. కొన్ని కథలు తనకు నచ్చకపోవడం వల్ల వదులుకుంటే, కొన్ని రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడం వల్ల ఆఫర్లు రాకపోవచ్చు.
ఇక మిగిలిన వాళ్లతో పోలిస్తే నాకు తక్కువ రెమ్యునరేషనే ఇచ్చారు, నాకింత గుర్తింపు వస్తుందని వాళ్లు కూడా ఊహించి ఉండరు. అసలు టీవీ నుంచి తీసుకున్న కంటెస్టెంట్లలో నేనే మొదటి వ్యక్తిని. నా తర్వాతి నుంచి ఇప్పుడు ప్రతీ సీజన్‌లో బుల్లితెర నుంచి తప్పకుండా తీసుకుంటున్నారు. వాళ్లందరికి ఇలా ఆఫర్స్ వస్తున్నాయంటే అది నా వల్లే అని చెప్పొచ్చు. బిగ్‌బాస్ షోలో నా అనుభవం అంత వయసు కూడా లేని దీప్తి సునైనా నేను రెండు వారాల్లో వెళ్లిపోతానని చెప్పడంతో కౌశల్ అంటే ఏంటో నిరూపించాలనుకున్నా. కష్టపడి టైటిల్ గెలిచా’ అని వివరించాడు. ప్రస్తుతం కౌశల్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.