మంత్రిగా కవిత….రాజ్యసభకి వినోద్…కేసీఆర్ ప్లాన్ ?

kavitha as minister and Vinod for Rajya Sabha

సారు – కారు – పదహారు అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన తెలంగాణా అధికార టీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల నాటి హవా కొనసాగుతుందని భావించినా అలా కాకుండా పెద్దదేబ్బే తగిలింది. ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ 9 సీట్లకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలంగాణా ఉద్యమ సమయం నుండి యాక్టివ్ గా ఉన్న సీఎం కుమార్తె కవిత అయితే రికార్డు స్థాయిలో ఓడిపోయారు. మరోపక్క ఎప్పుడూ కేసీఆర్ వెన్నంటే ఉండే ఆయనకు అత్యంత సన్నిహితుడు వినోద్ సైతం ఓటమి పాలయ్యారు. అయితే ఈ ఇద్దరి విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ – టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫలితాలపై సమీక్ష జరిపారు.ఈ సమీక్ష సందర్భంగా  ఓటమి చెందిన కవితకు మంత్రి పదవి – వినోద్ కుమార్ కు రాజ్యసభ కట్టబెట్టే అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. కవితను ఎమ్మెల్సీగా ఎన్నుకొని ఆమెను మంత్రివర్గంలోకి తీసుకుని మంత్రివర్గంలో మొదటి మహిళా మంత్రిగా చేయాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా మహిళా మంత్రి లేని లోటు తీర్చినట్లు కూడా అవుతోందని మరోవైపు పార్టీ సీనియర్ నేత అయిన వినోద్ సేవలు దేశీయంగా కూడా ఉపయోగించుకునేలా ఆయన్ను రాజ్యసభకు పంపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. తిరుమల పర్యటన నుంఉచి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయంలో తుది నిర్ణయం ఉంటుందని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే దీనిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు టీఆర్ఎస్. ఏది ఏమైనా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తుంటే కవితకు మంత్రి పదవి ఇచ్చే ఛాన్స ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది.