తెలంగాణ రాష్ట్రం లో వర్షాల కారణంగా భారీ నష్టం సంభవించింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నగర వాసుల బాధలు వర్ణనతీతం. అయితే భారీ వర్షాలతో అతలాకుతలం అయిన భాగ్యనగరం లో వరద ప్రభావానికి గురి అయిన వారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్ధిక సహాయం ను ప్రకటించారు.
వరద ప్రభావానికి గురి అయిన ప్రతి ఇంటికి పది వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. అయితే మంగళవారం నుండే ఈ ఆర్థిక సహాయాన్ని అందించనున్న విషయాన్ని తెలిపారు. అయితే పూర్తిగా ఇళ్లు కూలిపోయిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా ధ్వంసం అయిన ఇళ్ళ కి 50 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.
అంతేకాక భారీ వర్షాల కారణంగా దెబ్బ తిన్నటువంటి రహదార్ల మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పన చర్యలు చేపట్టిన విషయాన్ని వెల్లడించారు. అయితే పేదలకు సహాయం కోసం రూ.550 కోట్లను తక్షణమే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ ప్రకటించిన ఆర్ధిక సహాయం కాస్త ఊరట కలిగిస్తుంది అని చెప్పాలి.