కరోనా వైరస్ ప్రభావంపై కేసీఆర్ సుదీర్ఘ భేటీ

ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న మహమ్మారి కరోవా వైరస్. ఈవైరస్ ను తరిమి కొట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వైద్య, రెవిన్యూ, వ్యవసాయ శాఖ కార్యదర్శులతో చర్చించి కరోనా వైరస్ నియంత్రణకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే.. అవకాశమున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో ఒకవేళ లాక్ డౌన్ ను పొడిగించాల్సి వస్తే.. ఆ తర్వాత చేపట్టవలసిన చర్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు ఆయన తెలిపారు. నిత్యావసర సరుకులతో పాటు రేషన్ పంపిణీకి చేపట్టాల్సిన చర్యలను సమీక్షించారు. ఇంట్లో ఎవరికి జ్వరం వచ్చినా… అందరికీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో సీఎం సహాయనిధికి ఉద్యోగులు, టీచర్లు నలభై ఎనిమిది కోట్ల రూపాయల విరాళంగా ఇచ్చారని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

అదేవిధంగా ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశంలో కొన్ని ముఖ్య శాఖలకు సంబంధించిన మంత్రులు కార్యదర్శులు పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ, రెవిన్యూ, పౌరసరఫరాల శాఖ అగ్రికల్చర్ సంబంధించిన మినిస్టర్స్ కార్యదర్శులు సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితుల మీద ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిబంధనలు మరింత కఠినతరం చేయాలని కేసీఆర్ తెలిపారు.