కాంగ్రెస్ ఓయూ ప్లాన్ కు కేసీఆర్ కౌంటర్

http://telugubullet.com/wp-content/uploads/2017/06/kcr-counter-to-ou-congress-.jpg

ఉద్యమాల వర్సిటీ ఉస్మానియాలో రాజకీయ సభ పెట్టడానికి ప్రతిపక్షాలు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే ఈ రేసులో ముందున్నది మాత్రం కాంగ్రెస్సే. సంగారెడ్డి సభ తర్వాత జోష్ మీదున్న హస్తం పార్టీ.. ఓయూలో విద్యార్థి గర్జన జరిపి సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది. ఈ సభకూ రాహుల్ ను రప్పించాలని ఆలోచస్తోంది. కానీ వారి ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎధురైంది.

టీఆర్ఎస్ ప్రస్తుతం ఓయూలో నోరెత్తే పరిస్థితి లేదు. కేసీఆర్ అయితే రాజకీయాల కోసం అడుగుపెట్టే సీన్ కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని కల్లబొల్లి కబుర్లు చెప్పిన కేసీఆర్.. కనీసం ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయడం లేదని ఓయూ స్టూడెంట్స్ ఆగ్రహంగా ఉన్నారు. మిగతా జనాన్ని నమ్మించినట్లు… వీరి దగ్గర కేసీఆర్ పప్పులు ఉడకటం లేదు. అందుకే శతాబ్ది ఉత్సవాల్లో కూడా నోరు తెరవకుండా వచ్చేశారు కేసీఆర్.

కేసీఆర్ సభ పెట్టలేని చోట.. కాంగ్రెస్ సభ పెడితే ఇంకేమైనా ఉందా..? తెలంగాణ సాధకుడు కేసీఆర్ పరువు హుస్సేన్ సాగర్లో కలిసిపోయినట్లేగా. అందుకే నాకు దక్కంది ఎవ్వరికీ దక్కకూడదని అట్నుంచి నరుక్కొచ్చారు గులాబీ బాస్. క్యాంపస్ లో రాజకీయ సభలకు అనుమతి లేదని, అది రూల్స్ కు విరుద్ధమని ఉస్మానియా వర్సిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో టీకాంగ్రెస్ నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడింది.