లాక్‌డౌన్‌ పై కేబినెట్‌ కీలక నిర్ణయం

లాక్‌డౌన్‌ పై కేబినెట్‌ కీలక నిర్ణయం

శనివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. లాక్‌డౌన్‌, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్‌ చర్చించనుంది. దాంతో పాటుగా గోదావరి వాటర్‌ లిఫ్ట్‌, హైడల్‌ పవర్‌ ఉత్పత్తితో పాటు పలు అంశాలపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటి జరగనున్నట్లు సమాచారం.ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న లాక్‌డౌన్‌ నేటితో ముగియనుంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ పై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకొనుంది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గడంతో ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు కాస్త సడలింపులను ఇచ్చారు. జూన్ 8న కేబినెట్ భేటీలో లాక్‌డౌన్‌ను పది రోజుల పాటు పొడిగించడంతో పాటు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే.