తెలంగాణ ఆర్టీసి సమ్మె పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణలో ఆర్టీసి కార్మికులు 52 రోజులు సమ్మె చేసి సమ్మె విరమించిన సంగతి అందరికి తెలిసిందే కదా. అయితే కార్మికులను విధుల్లో చేర్చుకునేందుకు సర్కార్ మాత్రం సిద్దంగా లేదు. ఇష్టం వచ్చినప్పుడు వచ్చి చేరుతామంటే చేర్చుకునేది లేదని ఆర్టీసి ఎండీ తెలిపారు.
దీంతో తెలంగాణలో ఆర్టీసి సమ్మెకు పుల్ స్టాప్ పెట్టే దిశగా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 28,29 న తెలంగాణ కేబినేట్ భేటి జరగనుంది. ఈ సమావేశంలో సుదీర్ఘంగా ఆర్టీసి పై చర్చించనున్నారు. ఆర్టీసికి ఒక శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా కార్మికులకు రెండు ప్రధాన షరతులు పెట్టి విధుల్లోకి తీసుకోవాలని సర్కార్ భావిస్తున్నట్టుగా సమాచారం వినిపిస్తుంది.
ఆర్టీసిని ప్రభుత్వ పరం చేయాలన్న శాశ్వత డిమాండ్ వదిలేయాలి. నిర్ధిష్ట కాలం పాటు మరోసారి సమ్మెకు దిగకుండా కార్మికులు, కార్మిక సంఘాలతో సంతకాలు చేయించాలని నిర్ణయం. ప్రస్తుతం ఆర్టీసికి సంబంధించి కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటి తీర్పు వచ్చే వరకు వేచి చూస్తే ప్రజా రవాణాకు ఇబ్బంది కలుగుతుందని, అలాగే కార్మికులలో కూడా మానసిక స్థైర్ధ్యం దెబ్బతినే అవకాశం ఉందని సర్కార్ భావిస్తుంది.
కేబినేట్ భేటి రెండు రోజుల పాటు సాగనుంది. బహూశా రెండు రోజుల కేబినేట్ భేటి ఇదే మొదటి సారని రాజకీయవేత్తలు అంటున్నారు. 28న ప్రారంభమైన సమావేశం అర్ధరాత్రి వరకు సాగే అవకాశం ఉంది. ఆ తర్వాత 29న జరిగే సమావేశం కూడా అర్ధరాత్రి వరకు సాగే అవకాశం ఉంది.
రెండు రోజుల్లో 20 గంటలకు పైగా కేబినేట్ సమావేశం కానుందని సమాచారం. ఈ రెండు రోజుల పాటు చర్చించిన అంశాలు 29 అర్ధరాత్రి వరకు కూడా బాహ్య ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా సమాచారం వినిపిస్తుంది. 29వ తేది రాత్రి ఆర్టీసికి సంబంధించి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని సమాచారం.