కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతికి అంకితం ఇచ్చిన కేసీఆర్

KCR dedicated kaaleshwaram project to race

తెలంగాణ గడ్డపై మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణలో జలధారలు కురిపించే కాళేశ్వరం ప్రాజెక్ట్ కల సాకారమయ్యింది.. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం (21-06-2019) జాతికి అంకితం చేశారు. గోదావరి మాత విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్.. అనంతరం రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బ్యారేజ్‌ను ప్రారంభించారు. గవర్నర్ నరసింహన్.. ఏపీ, మహారాష్ట్ర సీఎంలు జగన్, ఫడ్నవీస్‌లు కొబ్బరి కాయలు కొట్టారు. అనంతరం జగన్, కేసీఆర్‌లు కలిసి కాళేశ్వరం శిలా ఫలకం ఆవిష్కరించారు. గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, సీఎం జగన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌లు మేడిగడ్డ బ్యారేజీ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడే ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. అక్కడి నుంచి గవర్నర్, ముగ్గురు ముఖ్యమంత్రులు మేడిగడ్డ పంప్‌హౌస్‌ ఉన్న కన్నెపల్లికి చేరుకొని పూర్ణాహుతిలో పాల్గొన్నారు. తర్వాత 6వ నంబర్‌ మోటార్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. నీటి ప్రవాహాలుండే డెలివరీ సిస్టర్న్‌ వద్ద గోదావరి జలాలకు పూజలు చేశారు. అనంతరం ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. తర్వాత కన్నెపల్లి గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్న భోజనాలు చేసిన తర్వాత తిరుగు ప్రయాణమవుతారు. అంతకముందు మేడిగడ్డ యాగశాలలో కేసీఆర్ దంపతులు హోమంలో పాల్గొన్నారు. శృంగేరీపీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలసంకల్ప హోమం నిర్వహిస్తున్నారు. హోమానికి కేసీఆర్ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేశారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరుణుడి కరుణ కోసం వేద పండితులు జల సంకల్ప హోమం నిర్వహిస్తున్నారు. శృంగేరి పీఠానికి చెందిన ఫణిశశాంక్‌ శర్మ, గోపీకృష్ణ ఆధ్వర్యంలో 40 మంది వేద పండితులు పూజలు చేస్తున్నారు