కీలక ఆదేశాలను జారీ చేసిన ముఖ్యమంత్రి

కీలక ఆదేశాలను జారీ చేసిన ముఖ్యమంత్రి

తెలంగాణ రాష్ట్రం లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు పలు కీలక ఆదేశాలను జారీ చేశారు. భారీ వర్షాలు కురవడం మూలాన అధికార యంత్రాంగం అప్రమత్తం గా ఉండాలి అని తెలిపారు. ఆదివారం నాడు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి అని, సోమవారం మరియు మంగళవారం నాడు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం ను సీఎం కేసీఆర్ ఈ మేరకు గుర్తు చేశారు.

అయితే ఈ వర్షాల నేపద్యం లో అధికారులను అప్రమత్తం చేయాలని సి ఎస్ సోమేష్ కుమార్ ను కేసీఆర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్ లతో పరిస్తితుల పై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని తెలిపారు. పరిస్థితిని బట్టి సహాయక చర్యలు చేపట్టాలి అని, భారీ వర్షాల కారణంగా వరదలు కూడా సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి అని తెలిపారు. ఈ నేపధ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారి పై ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.