తెలంగాణ సీఎం కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు గాయాలయ్యాయి. హిమాన్షు ఇంట్లో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడని దీంతో కాలికి గాయమైనట్టు తెలుస్తుంది. అయితే తీవ్రమైన నొప్పి కారణంగా నిలబడలేని స్థితిలో ఉండడంతో హిమాన్షును చికిత్స కోసం నిన్న రాత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు.
అయితే హిమాన్షుకు సీటీ స్కాన్ చేసిన యశోద ఆసుపత్రి వైద్యులు తుంటి ప్రాంతంలో, మోకాలికి ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి కేటీఆర్ దంపతులు రాత్రంతా ఆస్పత్రిలో కుమారుడితో పాటే ఉన్నట్లు సమాచారం. అయితే మనువడు ఆసుపత్రిలో చేరాడని తెలుసుకున్న సీఎం కేసీఆర్ యశోదా ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి పరిస్థితి, వైద్య సేవల గురుంచి ఆరాతీసినట్లు సమాచారం.