యంగ్ హీరో నితిన్ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తన వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం పలికారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌కు స్వయంగా శుభలేఖను అందజేసి వివాహానికి హాజరై ఆశీర్వదించాలని నితిన్ కోరారు. నితిన్‌తోపాటు ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డి కూడా సీఎం కేసీఆర్‌ను కలిశారు.
కాగా, ఈనెల 26న తన ప్రేయసి షాలినితో నితిన్ మనువాడబోతున్నారు. ఫిబ్రవరి15న నితిన్ షాలినిల నిశ్చితార్థం చేసుకోగా ఇక ఏప్రిల్ 16న మోగాల్సిన పెళ్లి బాజాలు కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. తాజాగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యంత సన్నిహితులు సమక్షంలో తన ప్రేయసి మెడలో మూడుముళ్లు వేయనున్నారు నితిన్.