కాంగ్రెస్ చేస్తున్న అబివృద్ది సంక్షేమ పథకాలను చూసి కేసీఆర్ తట్టుకోలేక పోతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. మళ్లీ అధికారం కోసం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఇవాళ లింగంపేట్ మండలం షెట్‌పల్లిలో భూ భారతిపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులోమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భూ భారతి చట్టం పేదలకు చుట్టమని తెలిపారు. భూ భారతి ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తుందని అన్నారు. ధరణితో రైతులు కార్యాలయాలకు చెప్పులరిగేలా తిరిగారని తెలిపారు.





