సెంటిమెంట్ తో అస్సమతి కొట్టాలని చూస్తున్న కేసీఆర్‌…!

KCR Is Trying To Assimilate With Sentiment

కొన్ని రోజుల క్రితం షాద్నగర్ లో అస్సమతి వర్గాలు ధర్నాలు చేసిన సంఘటన రాష్ట్ర రాజకీయాల లో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో పోలీసులుకు కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. షాద్నగర్ తెరాస టికెట్ మాజీ ఎం ఎల్ ఏ అంజయ్య యాదవ్ కి ఇవ్వడం తో వీర్లపల్లి శంకర్,కార్యకర్తలు షాద్నగర్ లో ర్యాలీ నిర్వహించి ఆందోళన వ్యక్త పరిచారు. ఇలా పలు చోట్ల అసమ్మతి వర్గాలు ఆందోళనకి దిగాయి . అయితే ఈ వివాదాల్ని చాలార్చేందుకు టి ఆర్ స్ అధినేత కె సి ర్ తనకున్న చివరి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటున్నారు. ఎంతో కస్టపడి తెచుకున్న ఈ రాష్ట్రము లో అందరం మమైకంగా ఉంటేనే ప్రత్యర్ధ పార్టీలను ఓడించి అధికారం లో ఉండగలుగుతాం అని అందరి లోని బాగోద్వేగాలను రేకెత్తిస్తున్నారు. తెలంగాణ పార్టీ అధికారం లో ఉంటేనే అందరికి సమన్యాయం జరుగుతుందని అస్మతి వర్గాలని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు.

KCR-TRS-SABHA-SPPECH

కేవలం ఒక గంట వ్యవధి లో అసంబ్లీ ని రద్దు చేసి అబ్యర్ధులని ప్రకటించిన తీరు పై పలు చోట్ల తీవ్ర అసంతృప్తి నెలకొనింది, పార్టీ పై కోపం గా ఉన్న అసమ్మతి వర్గాలుని చాలార్చే ప్రయత్నం లో గులాబీ నేత తనదైన శైలిలో తెలంగాణా సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా తీవ్ర దూమారం రేపిన చెన్నూరు టికెట్ అభ్యర్థిని తన మాటలతో సెంటిమెంటి అస్త్రాలతో తన దారికి తెచుకున్నారు. ఇలా ఒకరు దారికి రావడం తో ఇక కేసీఆర్‌ అస్సమతి వర్గాలు పైన ఇదే సెంటిమెంట్ అస్త్రాలని ఉపాయగించి ఒక్కొరికగా పీల్చి అందరికి బోధనలు చేస్తున్నారు . పార్టీ అధికారం లోకి రాగానే ఎం ఎల్సీ ఇస్తాను అంటూ తాయిలాలు చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో అసమ్మతి వర్గాలు తో కూడా చర్చలు జరిపారు, ఒక వేళా వాళ్ళు దారికి రాకపోతే తన పదవికే ఎసరు పడుతుందని భావించిన కేసీఆర్‌ పలు విధాలుగా వారిని శాంతించే ప్రయత్నం చేసారు. కేసీఆర్‌ ఎన్ని చెప్పిన పట్టించుకోని వర్గాలు కొన్ని ఉన్నాయి వాటిని కూడా ఎలా దారిలోకి తెచ్చుకోవాలి అనే ప్రయత్నం లో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం.

kcr-telangana

రాజకీయాలలో మనుషులు పరిస్థిలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ పండితులు కూడా అంచనా వెయ్యలేరు. శత్రువు అనుకున్న వారు మిత్రులు అవ్వచ్చు , మిత్రుడు అనుకున్నవాడు శత్రువు అవ్వచ్చు , ప్రస్తుతానికి ఈ గులాబీ నేత అసమ్మతి వర్గాలను శాంతపరిచిన ఎన్నికల సమయం దగ్గర పడే కొండి సమీకరణాలు మారిపోయి అవకాశాలు లేకపోలేదు. రాజకీయాలలో సెంటిమెంట్ కన్నా ఆత్మ గౌరవం ముఖ్యమనుకునే నాయకులూ చాలా మందే వున్నారు. ఆ నేతలు ఎలాగైనా వారి గౌరవాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి నిర్ణయాలు ఆయన తీసుకునే అవకాశాలు లేకపోలేదు. టి ఆర్ స్ పార్టీ పైకి గంభీరం గా కనిపిస్తున్న లో లోపల ఆందోళనులు అయితే అలానే ఉన్నాయి. సెంటిమెంట్ తో బుజ్జగింపులతో, తాయిలాలతో ఈ అస్సామాతి టెన్షన్ పూర్తిగా విజయవంతం కాలేదని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. వీటన్నిటి మీద విజయ సాధించడానికి కేసీఆర్‌ ఇక ముందు ఎలాంటి అస్త్రాలతో ముందుకు వస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది.

kcr