మళ్లీ ఉపఎన్నికలకు కేసీఆర్ రెడీ

kcr-ready-for-vemulawada-by-poll-elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దుతో… కేసీఆర్ హుషారుగా ఉన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే పౌరసత్వం రద్దైనందుకు కాస్త బాథగానే ఉన్నా.. ఇప్పుడు ఉపఎన్నిక వస్తే తమకే అనుకూలమని ఆయన ఆలోచిస్తున్నారు. తన పథకాలతో ప్రజలంతా సుఖంగా ఉన్నారని, వేములవాడలో టీఆర్ఎస్ కు పట్టుంది కాబట్టి, కచ్చితంగా గెలుస్తామని కేసీఆర్ అంచనా.

కానీ అదే జరిగితే కేసీఆర్ ప్రజావ్యతిరేకతకు కూడా అదే తొలిమెట్టు అవుతుందని చెబుతున్నారు విశ్లేషకులు. ఇప్పటికే కేసీఆర్ చేతలతో చాలాచోట్ల వ్యతిరేకత ఉందని, మరి ఆ వ్యతిరేకత అంతా ఏకతాటిపైకి వచ్చి వేములవాడలో ఫలితం తేడా కొడుతుందేమోనని కొందరు గులాబీ నేతలు భయపడుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం అలా జరగదంటున్నారట.

ఉపఎన్నికల్లో అధికార పార్టీల వైపే మొగ్గు ఉంటుందనేది తెలుగు రాష్ట్రాల సంప్రదాయం. అది నిజమే అయినా ఉపఎన్నికలతోనే అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ను.. అదే ఉపఎన్నికలతో దెబ్బ కొట్టాలని జనం అనుకుంటే పరిస్థితేంటని క్యాడర్ అయోమయంలో పడింది. పైగా గులాబీ ఎమ్మెల్యేనే పౌరసత్వం లేకుండా ఈసీని ఏమారిస్తే.. అది పార్టీపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని అంచనాలు వేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు:

డేరా బాబా సీక్రెట్స్ మీరూ చూస్తారా ?

బాబుకి కామన్ సెన్స్ లేదా ?

విజయవాడ కి కెసిఆర్… ఎందుకంటే?