కేసీఆర్ వరాల జల్లు…!

KCR Is Scared Of Candidates With Surveys

రాష్ట్రంలోని రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. గతంలో వచ్చిన సమస్యలు రాకుండా ఈసారి పకడ్బందీగా అమలు చేస్తామన్నారు.
రాష్ట్రంలో 45.5 లక్షల మంది రైతులు ఉన్నారని, అందులో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్నవారు 42లక్షల మంది ఉన్నట్టు కేసీఆర్ చెప్పారు.

kcr-manifesto
రైతుబంధు పథకం కింద ప్రస్తుతం ఏడాదికి రూ.8వేలు ఇస్తుండగా, దాన్ని రూ.10వేలకు పెంచాలని నిర్ణయించారు.
రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవవేతనం ఇవ్వాలని మేనిఫెస్టో కమిటీ ప్రతిపాదించింది.
మహిళలకోసం ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు.
అంతేకాక రాష్ట్రంలో పెన్షన్లను డబుల్ చేయాలని టీఆర్ఎస్ మేనిఫెస్టో నిర్ణయించింది. అలాగే, వయోపరిమితి కూడా తగ్గించారు. 57 ఏళ్లు దాటిని వారికి పెన్షన్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.
ఆసరా పెన్షన్లను రూ.1000 నుంచి రూ.2016కు పెంచారు.
అలాగే వికలాంగులకు నెలకు రూ.1500 నుంచి రూ.3016కు పెంచాలని తీర్మానించారు.
రాష్ట్రంలో నిరుద్యోగులకు కూడా భృతి ఇవ్వాలని టీఆర్ఎస్ మేనిఫెస్టో దాదాపు ఖరారు చేసింది. రాష్ట్రంలో సుమారు 11 లక్షల నుంచి 12 లక్షల నిరుద్యోగులు ఉన్నట్టు లెక్కలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు.
అయితే, లెక్కలతో సంబంధం లేకుండా నిరుద్యోగులు అందరికీ నెలకు రూ.3016 భృతి ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిబంధనలు రూపొందిస్తామన్నారు.
2019 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కొత్త పథకాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. నిరుద్యోగ భృతికి సంబంధించి విధివిధానాల రూపకల్పనకు మూడు, నాలుగు నెలలు పడుతుందన్నారు.

kcr
ఎస్సీల కోసం రూ.10వేల కోట్లు, ఎస్టీల కోసం రూ.6వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని కేసీఆర్ చెప్పారు. అయితే, మేనిఫెస్టో ఫైనల్ ప్రతి రెడీ అయినప్పుడు పూర్తి వివరాలు ప్రకటిస్తామని చెప్పారు.
అగ్రవర్ణ పేదల కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది చిన్న ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందన్నారు. చిన్న ఉద్యోగులు మరోసారి ఆశీర్వదిస్తే ‘మీ కడుపులు నింపుతాం’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఉద్యోగులు ఐఆర్ మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భరోసా ఇచ్చారు.
కోట్ల కోసం కాకుండా అమలుకు వీలయ్యే అంశాలనే ప్రజలకు చెబుతామని, ప్రజలు కోరిన అంశాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని కేసీఆర్ చెప్పారు.