వోటుకి నోటు కేసు వల్ల కేసీఆర్ కే ఎక్కువ నష్టమా ?

KCR review meeting on Cash for vote scam case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఓటుకు నోటు కేసు తెలుగు రాజకీయాల్లోనే పెను సంచలనాలు సృష్టించిన అంశం. ఒక రాష్ట్ర సీఎం మరో రాష్ట్ర సీఎం ఫోన్ లు ట్యాప్ చేసి కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ బయటకి వదలడం అప్పట్లో సంచలనాలు సృష్టించింది. అయితే ఈ కేసుని మరో మారు తెర మీదకు తెచ్చారు తెలంగాణా ముఖ్యంమంత్రి కేసీఆర్. వాయిస్‌ రికార్డుపై ఫోరెన్సిక్‌ విభాగం ఇచ్చిన నివేదికను దర్యాప్తును అధికారులు సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఇకపై ఏవిధంగా ముందుకెళ్లాలనే అంశంపై అధికారులతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. ఓటుకి నోటు కేసులో టీడీపీ ఇరుక్కుపోయి ఉంటే, ఫోన్ టాపింగ్ వివాదం లో తెలంగాణ ప్రభుత్వం ఇరుక్కుని ఉంది. సదరు కేసు ముందు కెళ్తే ఫోన్ టాపింగ్ చేసినందుకు తెలంగాణ గవర్నమెంట్, దాన్ని తామేదో ఒక స్టింగ్ ఆపరేషన్ చేసామని ప్రకటించినందుకు కెసిఆర్, లంచం ఇమ్మని ప్రేరేపించిన కేసు లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఇలా అందరికి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.

టెలిగ్రాఫ్ ఆక్ట్ 419 A లో ఫాలో అవ్వాల్సిన ఏ ఒక్క రూల్ కూడా ఫాలో కాకుండా చేసిన టాపింగ్ కాబట్టి చేసిన తెలంగాణా అధికారులు చేయిచిన కేసీఆర్, అలాగే సంబదింత మంత్రులు ఇలా చాలా మంది చట్టానికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ కేసు మరలా లైన్ లోకి వచ్చి రేవంత్ దోషి అని తేల్చబడితే ఇప్పడు బెయిల్ మీద ఉన్న రేవంత్ రెడ్డికి శిక్ష ఖరారు అయ్యే అవకశాలు ఉన్నాయి. బాబుని కార్నర్ చేయాలి అంటే ఉన్న ఏకైక ఆధారం వాయిస్ క్లిప్, కానీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో ఒక సెలెబ్రిటి వాయిస్ ని ఇమిటేట్ చేయడం పెద్ద విషయం ఏమీ కాదు. సో అది బాబు వాయిస్ కాదని వాదించే అవకాశాలు ఉన్నాయి కానీ ఫోన్ టాపింగ్ చేసినట్టు వారికి వారే ప్రకటించుకున్నారు కాబట్టి కేసీఆర్ సర్కార్ కే నష్టం ఎక్కువ. అలాగే కొందరు నేతల ఫోన్ ట్యాప్ చేసినందుకు సాక్ష్యాత్తు కర్ణాటక ముఖ్యమంత్రి (రామకృష్ణ హెగ్డే) రాజీనామా చేసి తప్పుకున్నారు అంటే ఆ కేసు తీవ్రత మనం అర్ధం చేసుకోవచ్చు. సో ఈ కేసు తెర మీదకి తెస్తే చంద్రబాబు జైలుకి వెళ్ళడం మాట అటుంచి కేసీఆర్ పదవీ గండం సహా జైలుకి వెళ్ళే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.