హడావుడి చేసి ఆగిపోయారేంటి?

Vijay Devarakonda Taxiwala Movie Release Postponed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ట్కాక్సీవాలా’. ఈ చిత్రంను ఈనెల 18న విడుదల చేయాలని భావించారు. అందుకోసం ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. అర్జున్‌ రెడ్డితో భారీ క్రేజ్‌ను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ తాజాగా మరో విజయాన్ని ఈ చిత్రంతో దక్కించుకోవడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు గట్టిగా చెప్పారు. గీతాఆర్ట్స్‌ 2 మరియు యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంపై సినీ వర్గాల్లో కూడా భారీ ఆసక్తి ఉంది. ఆ కారణంగా ఈ చిత్రంకు మంచి బిజినెస్‌ జరిగింది. దాంతో సినిమాపై ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

వేసవి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుందని అంతా భావించారు. కాని చిత్ర యూనిట్‌ సభ్యులు మొన్నటి వరకు హడావుడి చేసి ఇప్పుడు కామ్‌ అయ్యారు. సినిమా విడుదలకు ఆలస్యం అయ్యేలా ఉంది. దాంతో సినిమా ప్రమోషన్‌ను ఆపేసినట్లుగా తెలుస్తోంది. సినిమా షూటింగ్‌ పూర్తి అయినప్పటికి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ఆలస్యం అవుతుంది. సినిమాలో కొన్ని సీన్స్‌కు గ్రాఫిక్స్‌ వర్క్‌ చేయాల్సి ఉంది. ఆ సీన్స్‌ ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే విడుదలకు టైం తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంను జూన్‌ రెండవ లేదా మూడవ వారంలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. హడావుడిగా విడుదల చేసి అబాసుపాలు అవ్వడం కంటే కాస్త స్లోగా విడుదల చేయడం బెటర్‌ అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు నిర్ణయానికి వచ్చారు.