మార్గదర్శి కేసులో ఉండవల్లికి కెసిఆర్ సర్కార్ కితాబు.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ ఏర్పడ్డాక ఈనాడు పత్రిక కెసిఆర్ సర్కార్ కి అనుకూలంగా వార్తలు రాస్తోందని అన్ని పార్టీలు ఒప్పుకుంటున్న మాట. ఇక తెలంగాణ వస్తే రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దున్నేస్తామని చెప్పిన కెసిఆర్ కూడా స్వయంగా రామోజీని కలిసి వచ్చారు. ఆ ఇద్దరి మధ్య మైత్రి ఇప్పుడు ఓపెన్ సీక్రెట్. అయితే ఒకప్పుడు మార్గదర్శి కేసుతో రామోజీకి తలనొప్పిగా మారిన ఉండవల్లికి కెసిఆర్ సర్కార్ కితాబు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అది కూడా మార్గదర్శి కేసుకి సంబంధించే. ఈ విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ స్వయంగా ఓ యు ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బయటపెట్టారు.

మార్గదర్శికి సంబంధించి ఇప్పటికీ కేసు నడుస్తోంది. ఆ కేసులో తాను కూడా ఇంప్లీడ్ అవుతానంటూ ఇటీవల ఉండవల్లి ముందుకొచ్చారు. సదరు కేసుకి సంబంధించిన వివరాల్ని కెసిఆర్ సర్కార్ కి పంపారు ఉండవల్లి. అందుకు తిరుగు సమాధానం ఇచ్చింది కెసిఆర్ సర్కార్. మీరు ఈ కేసుకి సంబంధించి చేసిన కృషి కి భేష్ అంటూ కెసిఆర్ సర్కార్ ఉండవల్లిని అభినందించింది. అయితే అక్కడే అసలు ట్విస్ట్ వుంది. మీ లాగే ఈ కేసుని మేము కూడా చిత్తశుద్ధితో నడిపిస్తామని, మీరు ఇందులో ఇంప్లీడ్ కానవసరం లేదని కెసిఆర్ సర్కార్ ఉండవల్లికి బదులు ఇచ్చింది.

మరిన్ని వార్తలు

రోజాకు పవనే రావాలట

కెసిఆర్ ఆరోగ్యం గుట్టు విప్పిన మనవడు.

బాబుని అడిగితే ఎన్టీఆర్ ఇస్తానంటున్నాడు.