తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. తొలిసారిగా కేసీఆర్ సీఎం హోదాలో గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. స్వయంగా కేసీఆర్ గాంధీ ఆస్పత్రిలో పరిస్థితిని పరిశీస్తున్నారు. అనంతరం గచ్చిబౌలి టిమ్స్‌కు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ దగ్గర ఉంది. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 1500 మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు.
కరోనా వార్డుల్లో పేషెంట్లను సీఎం కేసీఆర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బందిని కేసీఆర్ అభినందించారు. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నారు. ఇక గాంధీ ఆస్పత్రి కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.