హైదరాబాద్ హయాత్ నగర్‌లో తల్లిని చంపిన కూతురు కీర్తిరెడ్డి కేసులో బయటపడిన నిజాలు చూసి పోలీసులు సైతం నివ్వెరపోయారు. ఇవాళ ఈ ఘటనపై ప్రెస్ మీట్ పెట్టిన పోలీసులు కీర్తిరెడ్డి హత్యకు ప్లాన్ వేసిన విషయాలు తెలిసి మేము సైతం షాక్‌కు గురయ్యామన్నారు. కీర్తిరెడ్డి తన తల్లిని గతంలో సైతం చంపడానికి ప్రయత్నించిందన్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. తల్లికి నిద్రమాత్రలు ఇచ్చి చంపేందుకు ప్రయత్నించిందని తెలిపారు. ఆ తర్వాత ప్రియుడు శశితో కలిసి తల్లిని చున్నీతో చంపి రైల్వే ట్రాక్‌పై పడేసిందన్నారు. తల్లిని హత్య చేసిన తర్వాత బంధువులకు ఫోన్ చేసి తల్లి గొంతుతో మాట్లాడుతూ ఊరికి వెళ్తున్నట్లుగా కూడా కీర్తిరెడ్డి తెలిపిందన్నారు. చంపిన తర్వాత డెడ్ బాడీని మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంచి ఆ తర్వాత కారులోకి తీసుకెళ్లి రామన్నపేట రైల్వే ట్రాక్‌పై పడేశారన్నారు.
చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు కీర్తిరెడ్డి, శశి చాలా ప్రయత్నాలు చేశారన్నారు. ఈ క్రైం చేసిన తీరు చూస్తుంటే దృశ్యం2 సినిమాకు సెకండ్ పార్ట్‌లా ఉందంటూ పోలీసులు సైతం నివ్వెరపోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రియుడు శశికుమార్ వెనుకుండి నడిపించాన్నారు. కీర్తి రెడ్డి మైనర్‌గా ఉన్నప్పుడు బాల్ రెడ్డి ఆమెపై అత్యాచారం జరపడంతో ఆమె గర్భవతి అయ్యిందన్నారు. దాంతో అబార్షన్ చేయించేందుకు శశి ఆమెకు సాయం చేశాడన్నారు. దీంతో అబార్షన్ విషయంలో కీర్తిరెడ్డిని శశి బ్లాక్ మెయిల్ చూస్తూ వచ్చాడన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రియుడు శశికుమార్ వెనుకుండి నడిపించాడని తేల్చారు.