సావిత్రి రూపంలో కీర్తి సురేశ్

keerthi-suresh-palying-savithri-role-in-mahanati-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మ‌హాన‌టి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కుతోన్న మ‌హాన‌టిపై ఇటు తెలుగుప్రేక్ష‌కుల్లోనూ, అటు త‌మిళ ప్రేక్ష‌కుల్లోనూ ఆస‌క్తి నెల‌కొంది. సినిమాకు సంబంధించిన విశేషాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకునేందుకు ప్రేక్ష‌కులు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. సావిత్రి పాత్ర‌లో హీరోయిన్ కీర్తి సురేశ్ న‌టిస్తున్నారు. అయితే షూటింగ్ మొద‌లై చాలా రోజులే అయినా…కీర్తిసురేశ్ ఫ‌స్ట్ లుక్ ఇంకా రిలీజ్ కాలేదు. దీంతో సావిత్రి గా కీర్తిసురేశ్ ఎలా క‌నిపిస్తుందో అని ప్రేక్ష‌కులు క్యూరియాసిటీతో ఉన్నారు.

ఈ త‌రుణంలో మ‌హాన‌టి సెట్ లో తీసిన కొన్ని ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈ పొటోలు సోష‌ల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. సావిత్రి కాలం నాటి సెట్ వేసి షూటింగ్ జ‌రుపుతున్న‌ట్టు వార్తలొచ్చాయి కానీ…కీర్తి సురేశ్ లుక్ …మ‌రీ ఆ కాలం నాటి మేక‌ప్ తో కనిపించ‌టం లేదు. అయితే చీర‌క‌ట్టులో సావిత్రిలానే కీర్తి సురేశ్ హుందాగా ఉన్నారు. చిత్ర యూనిట్ అధికారికంగా విడుద‌ల చేసే ఫ‌స్ట్ లుక్ లో అచ్చ‌మైన సావిత్రి రూపంలో కీర్తిసురేశ్ క‌నిపించ‌నున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై అశ్వినీద‌త్ కుమార్తె ప్రియాంక ద‌త్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆమె భ‌ర్త నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సావిత్రి జీవిత క‌థ తెలుసుకోటానికి నాగ్ అశ్విన్ చాలా ప‌రిశోధ‌న‌లు చేసిన‌ట్టు తెలుస్తోంది. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి తెలుగు, త‌మిళ భాష‌ల్లో హీరోయిన్ కు ప‌ర్యాయ‌ప‌దంగా మారిన సావిత్రి వెండితెర సామ్రాజ్ణిగా వెలుగొందారు. లెక్క‌పెట్ట‌లేనంత సంప‌ద స‌మ‌కూర్చుకున్నారు. సినిమాల్లోకి ప్ర‌వేశించిన కొన్నేళ్ల త‌ర్వాత అప్ప‌టి మ‌ద్రాసులో సావిత్రి నిర్మించుకున్న ఇల్లు ఇంద్ర‌భ‌వ‌నాన్ని త‌ల‌పించేద‌ని చెప్పుకునేవారు. కానీ త‌ర్వాత కాలంలో వ్య‌క్తిగ‌త జీవితంలో వైఫ‌ల్యాల‌తో తాగుడుకు బానిసై ఆమె స‌ర్వం పోగొట్టుకున్నార‌ని….

.చివ‌రకు చేతులారా మ‌ర‌ణం కొనితెచ్చుకున్నార‌ని..కొంద‌రు చెప్తుంటారు. మ‌హాన‌టిలో ద‌ర్శ‌కుడు ఈ విష‌యాలన్నింటిని చూపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమాలో సావిత్రి భ‌ర్త పాత్ర‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తున్నారు. స‌మంత‌, ప్ర‌కాశ్ రాజ్‌, కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు. వారితోపాటు అర్జెన్ రెడ్డి హీరో హీరోయిన్లు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే…కంచె ఫేం ప్ర‌గ్నా జైశ్శాల్ కూడా న‌టిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు:

‘జై లవకుశ’ ట్రైలర్…ఎన్టీఆర్ నట విశ్వరూపం

ఎందుకు అదే అడుగుతున్నారు?

అర్జున్ రెడ్డి అభిమానుల జాబితాలో చ‌ర‌ణ్ కూడా…