మహానటికి దక్కిన పారితోషికం ఎంతో తెలుసా?

Keerthi Suresh Remuneration For Mahanati Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు సినిమా ప్రముఖులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘మహానటి’. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో అశ్వినీదత్‌ కుమార్తెలు ఈ చిత్రంను నిర్మించారు. ఇక ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ నటించింది. నాగ్‌ అశ్విన్‌ దాదాపు ఆరు నెలల పాటు ఎంతో మంది హీరోయిన్స్‌ను పరిశీలించి, ఆడిషన్స్‌ చేసి చివరకు ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ అయితే బాగుంటుందని, సావిత్రి పాత్రకు ఆమె బాగా సూట్‌ అవుతుందని భావించాడు. అందుకే ఆమెను ఎంపిక చేయడం జరిగింది. సావిత్రి పాత్ర అనేగానే కీర్తి సురేష్‌ కాస్త భయపడ్డట్లుగా తెలుస్తోంది. 

కీర్తి సురేష్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తనపై పెట్టుకున్న నమ్మకంను నిలబెట్టింది. అచ్చు సావిత్రిలా ఉండి, మహానటికి జీవం పోసింది. మహానటి సావిత్రి పాత్ర అంటే మామూలు విషయం కాదు. ఈ పాత్ర కోసం కీర్తి సురేష్‌ దాదాపు 150 రోజు డేట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకోసం కీర్తి చాలా కష్టపడ్డట్లుగా కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. కీర్తి సురేష్‌ కష్టానికి ఫలితంగా భారీ మొత్తంలో పారితోషికాన్ని అందుకున్నట్లుగా తెలుస్తోంది. 

మొదట ఈ చిత్రం కోసం 1.5 కోట్ల పారితోషికంతో కీర్తి సురేష్‌ ఒప్పుకుంది. మద్యలో సినిమా కోసం ఎక్కువ డేట్లు ఇవ్వడంతో పాటు, ఆమె క్రేజ్‌ పెరగడం వల్ల మరో 75 లక్షల వరకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే మొత్తంగా 2.25 కోట్ల వరకు కీర్తి సురేష్‌కు ‘మహానటి’ వల్ల దక్కి ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక సమంత ఈ చిత్రంలో నటించినందుకు తక్కువ పారితోషిం తీసుకుందని, ఎక్కువ శాతం నటీనటులు అతి తక్కువ పారితోషికంకే నటించారు అంటూ ప్రచారం జరుగుతుంది.