హీరోయిన్‌తో పవన్‌కు మళ్లీ అదే రిలేషన్‌

keerthi-suresh-role-in-agna
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఏ స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌కు హీరోయిన్‌ సమంత మరదలు వరుస అవుతుందనే విషయం తెల్సిందే. అత్త కూతురుగా సమంత నటించింది. ఆ తర్వాత నితిన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రంలో కూడా సమంత హీరో నితిన్‌కు మరదలు వరుస అవుతుంది. త్రివిక్రమ్‌ తన సినిమాల్లో హీరో, హీరోయిన్‌ల మద్య బావ, మరదలు సంబంధంను కలుపుతున్నాడు. తాజాగా పవన్‌ 25వ చిత్రంలో కూడా హీరో, హీరోయిన్స్‌ మద్య సంబంధంను బావ మరదలుగా చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది.

పవన్‌ కళ్యాణ్‌కు హీరోయిన్‌ కీర్తి సురేష్‌ మరదలు వరుస అవుతుందని, ఆమెతో పవన్‌ చేసే రొమాన్స్‌, సరసాలు సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చిత్రంలో పవన్‌, కీర్తి సురేష్‌ల మద్య కాంబో సీన్స్‌ సెకండ్‌ హాఫ్‌లో హైలైట్‌గా ఉంటాయని, తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఆ సీన్స్‌ ఉంటాయని చెబుతున్నారు. త్వరలో సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకోబోతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయబోతున్నారు. కీర్తి సురేష్‌తో పాటు మరో హీరోయిన్‌గా అను ఎమాన్యూల్‌ నటిస్తుంది.