కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గుడ్ లక్ సఖి’. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది.
తాజాగా ఎట్టకేలకు గుడ్ లక్ సఖి సినిమా విడుదలకు సిద్ధమయ్యింది.ఈనెల 28న ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు ఆదిపినిశెట్టి కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.